ప్రెగ్నెన్సీలో చిగుళ్ల వ్యాధి.. ఇన్ఫెక్షన్లకు, అబార్షన్లకు కారణం అవుతుందా?

by Javid Pasha |

గర్భిణుల్లో చిగుళ్ల సమస్యలు గెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతాయి. తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రెగ్నెన్సీలో చిగుళ్ల వ్యాధి.. ఇన్ఫెక్షన్లకు, అబార్షన్లకు కారణం అవుతుందా?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల పలువురు ఎదుర్కొంటున్న సమస్యల్లో చిగుళ్ల వ్యాధి(Gum disease) ఒకటి. ఇదికేవలం దంతాలు, నోటి ఆరోగ్యంపైనే ప్రభావం చూపదు. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలు గర్భవతిగా ఉన్న సమయంలో గమ్ డిసీజ్ ఉంటే గనుక, అది ప్రసవ సమయంలో సమస్యలకు, పుట్టబోయే బిడ్డ అనారోగ్యాలకు కూడా కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘New England Journal of Medicine’ అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది.

గర్భిణి చిగుళ్ల సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అది నయం అయినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలోనూ గమ్ డిసీజ్ కంటిన్యూ అయితే గనుక పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భాశయ ఇన్ఫెక్షన్, అబార్షన్ లేదా ముందుస్తు ప్రసవానికి (Preterm delivery) కారణం అవుతుంది. ఎందుకంటే.. చిగుళ్లలోని బ్యాక్టీరియా రక్తంలోకి చేరుతుంది. అది ప్లసెంటా, గర్భాశయం వరకు కూడా వెళ్లడంవల్ల అక్కడ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ (ప్రోస్టాగ్లాండిన్ E2, TNF-α, IL-6) ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి గర్భాశయం సంకోచాలకు (contractions), ప్లసెంటాలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీంతోపాటు శిశువు తక్కువ బరువుతో (Low birth weight) పుట్టడానికి, అధిక రక్తపోటు సమస్యలకు(such as preeclampsia) దారితీస్తుంది.

గమ్ డిసీజ్‌తో బాధపడుతున్నవారు గర్భధారణలో హార్మోనల్ ఇష్యూస్ ఎదుర్కొనే చాన్స్ ఎక్కువ. అలాగే మార్నింగ్ సిక్‌నెస్, చిగుళ్లకు రక్త సరఫరా పెరగడం, డైటరీ మార్పులు వంటివి బ్లీడింగ్ గమ్స్, జింజివైటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు గెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్‌ను కూడా పెంచుతాయి. ఇవన్నీ తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా డెంటల్ చెకప్స్, క్లీనింగ్స్ వంటివి అవసరం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి చిగుళ్ల సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. Link

Next Story