- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమను తాము ఈ విధంగా భావించే మహిళలు స్ట్రాంగ్‌గా ఉంటారు..! ఎందుకంటే..
స్వీయ-ప్రేమ(Self-love) అనేది ఏమాత్రం స్వార్థం కాదు. పైగా అది ప్రపంచానికి మిమ్మల్ని మీరు ఎలా భావించాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో నేర్పుతుందని కూడా అధ్యయనం స్పష్టం చేసింది.

దిశ, ఫీచర్స్ : మిమ్మల్ని మీరు ఏ విధంగా ఊహించుకుంటే దాదాపు అదే విధమైన బిహేవియర్ లేదా పర్సనాలిటీ మీలో వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే టెక్సాస్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనం దీంతోపాటు మరో కొత్త అంశాన్ని కూడా వెల్లడించింది. ఏంటంటే.. తమను తాము స్వీయ ప్రేమను, నమ్మకాన్ని, దయా గుణాన్ని కలిగి ఉండే మహిళలు మిగతా వారికంటే మెంటల్లీ ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటారని పేర్కొన్నది. వివిధ సమస్యల్లో, ఒత్తిడిని ఎదుర్కొనే సందర్భాల్లో కూడా వీరు బలంగా ఉంటారని తెలిపింది. ఇంకా ఏయే అంశాలను ప్రస్తావించిందో చూద్దాం.
స్వీయ-ప్రేమ(Self-love) అనేది ఏమాత్రం స్వార్థం కాదు. పైగా అది ప్రపంచానికి మిమ్మల్ని మీరు ఎలా భావించాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో కూడా నేర్పుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. మహిళలు తమ పిల్లల్ని, భర్తల్ని లేదా కుటుంబాన్ని ప్రేమించడానికి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ, ఎక్కువ శ్రద్ధ కేటాయిస్తుంటారు. దీంతోపాటు తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. సమయానికి తినకపోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగానో, అవగాహన లేకనో ఆరోగ్యాన్ని విస్మరించడం వంటి సమస్యలు ఎదుర్కొనే వారిలో పురుషులకంటే మహిళలే అత్యధికంగా ఉంటారు. తమ పట్ల తాము దయను, స్వీయ ప్రేమను పెంపొందించుకోకపోవడం, లేదా నిర్లక్ష్యం చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంది. అలా జరగకూడదంటే మహిళలు తమపట్ల తాము కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా మహిళల మధ్య, మహిళలపట్ల కుటుంబ సభ్యుల మధ్య ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. దీనివల్ల మెదడులో హ్యాపీ హర్మోన్‌గా పేర్కొనే డోపమైన్ రిలీజ్ పెరుగుతుంది. ఇది కేవలం సంతోషాన్నే కాదు, ఆరోగ్యాన్ని, ప్రేమను, ప్రేరణను తద్వారా ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుతుంది. అందుకే మహిళలు స్వీయ దయను, స్వీయ ప్రేమను పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు తమను తాము బలమైన వారిగా ఊహించుకోవడం కూడా ఇక్కడ చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలంటున్నారు. స్వీయ గౌరవం, ఆత్మాభిమానం, సెల్ఫ్-లవ్ మహిళల మానసిక, శారీర ఆరోగ్యానికి, మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయని అంటున్నారు. Link






