Health : రోజూ 45 నిమిషాల వాకింగ్‌తో తగ్గుతున్న డిప్రెషన్.. అధ్యయనంలో వెల్లడి

by Javid Pasha |   (  Updated:2025-09-22 10:50:20  IST  )

ప్రతి రోజూ 45 నిమిషాల నడక లేదా జాగింగ్ చేసిన వారిలో 4 నెలల తర్వాత 60% మంది డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది

Health : రోజూ 45 నిమిషాల వాకింగ్‌తో తగ్గుతున్న డిప్రెషన్.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : నడక ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఫిజికల్ హెల్త్‌కు మేలు చేసే విషయం మాత్రమే కాదండోయ్.. మానసిక రుగ్మతల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ 30 లేదా 45 నిమిషాలపాటు, వారంలో 5 రోజులు వాకింగ్ చేస్తే డిప్రెషన్‌ను పూర్తిగా తగ్గించవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా రోజువారీ నడక లేదా జాగింగ్‌తో ముడిపడి ఉంటాయి. అదెలాగో తెలుసుకుందాం.

రోజువారీ నడక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి, యూఎస్‌లోని డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 50 ఏండ్లకంటే ఎక్కువ వయసుగల సుమారు 200 మంది మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ (MDD) ఉన్న రోగులను పరిశీలించారు. 16 వారాల పాటు వారి వ్యాయామాలలు(ఏరోబిక్ ఎక్సర్‌సైజ్), యాంటీడిప్రెసెంట్ మందులు (సెర్ట్రాలిన్) పనితీరును, అలాగే నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశ్లేషించారు. కాగా ఈ విధమైన ట్రయల్స్‌లో క్రమం తప్పకుండా రోజూ 30 నుంచి 45 నిమిషాల నడక లేదా జాగింగ్ చేసిన వారిలో 4 నెలల తర్వాత 60% మంది డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే కేవలం మందులు మాత్రమే వాడిన వారిలో ఇది 26% మాత్రమే తగ్గింది. దీనిని బట్టి నడక డిప్రెషన్‌ను సైతం పూర్తిగా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ నడక లేదా జాగింగ్ వంటివి చేయాలని సూచిస్తున్నారు. Link

Next Story