- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Traveling effect : ప్రయాణం మనసునే కాదు, మెదడు పనితీరును కూడా మార్చేస్తుంది..!
Traveling effect : ప్రయాణం మనసునే కాదు, మెదడు పనితీరును కూడా మార్చేస్తుంది..!

దిశ, ఫీచర్స్ : సరదాగా ట్రావెల్ చేయడం, కొంగొత్త ప్రాంతాలకు ప్రయాణించడం మానసిక ఆనందాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతుంటారు. సైన్స్ ప్రకారం అది మెదడు పనితీరును కూడా మారుస్తుందని, తద్వారా సృజనాత్మకతను పెంచుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. భిన్న సంస్కృతులను అనుభవించడం, విదేశాలకు ప్రయాణించడం వంటివన్నీ క్రియేటివిటీతోపాటు, బహుళ అవకాశాలతో ముడిపడి ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.
సైన్స్ డైరెక్టర్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. ట్రావెలింగ్ ఏ విధమైన ప్రభావం చూపుతుందో రీసెర్చర్స్ పరిశీలించారు. అయితే ఈ సందర్భంలో వారు ఇతర దేశాలకు, ప్రాంతాలకు ప్రయాణించిన ఎంబీఏ విద్యార్థులను పరిశీలించారు. కాగా ఇతర సంస్కృతులను పూర్తిగా అనుభవించిన ఎంబీఏ (MBA) విద్యార్థులు మరింత సృజనాత్మకంగా, సౌకర్యవంతంగా (Creative, comfortable) మారారని, అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే వీరికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని పరిశోధకులు గుర్తించారు.
మరొక అధ్యయనం ప్రకారం కూడా కేవలం ఉన్న ప్రాంతంలోనో, దేశంలోనో కాకుండా విదేశాల్లో జీవించడం గురించి ఆలోచించిన విద్యార్థులు సృజనాత్మకత పరీక్షలలో 50% మెరుగైన ఫలితాలు సాధించారు. కాబట్టి, కొత్త సంస్కృతుల (New cultures)లో నిమగ్నం అవడం, ట్రావెల్ చేయడం మెదడును సానుకూలం ప్రభావితం చేయడం ద్వారా సృజనాత్మకతను, సమస్య పరిష్కార నైపుణ్యాల(Problem solving skills)ను పెంచుతాయని పరిశోధకులు అంటున్నారు. ఇది నిజ జీవితంలో సక్సెస్‌కు కారణం అవుతుందని పేర్కొంటున్నారు.






