- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : మెదడుకంటే ముందే మాట్లాడే పేగు : ఒత్తిడిని ముందస్తు హెచ్చరికగా గుర్తించే అద్భుత వ్యవస్థ
ఒత్తిడి సంబంధిత ఇతర అనారోగ్యాలు సంభవించే ప్రక్రియలో పేగులు ఒక హెచ్చరిక వ్యవస్థలా పనిచేస్తూ ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తాయి.

దిశ, ఫీచర్స్ : వివిధ సందర్భాల్లో మనం ఎదుర్కొనే అనారోగ్యాలు, ప్రమాదాలు, ఒత్తిడి వంటి అంశాలను గ్రహించడంలో, శరీరాన్ని అలర్ట్ చేయడంలో మెదడు కీ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఒత్తిడి సంబంధిత సంకేతాలను, అనారోగ్యాలను మెదడుకంటే ముందే మన పేగులు(గట్) గ్రహించగలవని మీకు తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తల అధ్యయనం ఇదే చెబుతోంది. గట్-బ్రెయిన్ యాక్సిస్ ద్వారా పేగులు ఒత్తిడి హార్మోన్లను (కార్టిసాల్) మెదడు గుర్తించేకంటే ముందే గ్రహిస్తాయని వెల్లడించింది.
అదెలా సాధ్యం? మెదడుకంటే ముందే పేగులు ఒత్తిడి సంకేతాలను ఎలా పసిగడతాయి? అంటే గట్ - బ్రెయిన్ యాక్సిస్ అనే ద్విముఖ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా సాధ్యంమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది జీర్ణవ్యవస్థ, అలాగే నాడీ వ్యవస్థ మధ్య సంబంధాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. నిజానికి బాడీ లాంగ్వేజ్, గొంతు నుంచి వెలువడే వాయిస్, అలాగే చెమట ద్వారా విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్ల వంటి సూక్ష్మ సంకేతాలు పేగులో ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి. ఫలితంగా మన మైండ్ శరీరంలో ఏదో జరుగుతోందని గుర్తించేకంటే ముందే జీర్ణ వ్యవస్థ ఏదో ఒక సంకేతాన్ని ఇస్తుంది. దీంతో అజీర్తి లేదా అసౌకర్య ‘గట్ ఫీలింగ్’ వంటి భాన ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే ఒత్తిడి సంబంధిత ఇతర అనారోగ్యాలు సంభవించే ప్రక్రియలో పేగులు ఒక హెచ్చరిక వ్యవస్థలా పనిచేస్తూ, పరిసరాలలో(environment) ఒత్తిడి లేదా ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తాయి. ఈ సహజ విధానం మానవ శరీరాన్ని ఒత్తిడి సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షించడానికి రూపొందించబడి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. Link






