- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : బెడ్ రూమ్‌లో అడుగు పెట్టడానికి గంట ముందే ఆ పని చేయండి..! మీ ఆయుష్షు పెరుగుతుంది !!
Health : బెడ్ రూమ్‌లో అడుగు పెట్టడానికి గంట ముందే ఆ పని చేయండి..! మీ ఆయుష్షు పెరుగుతుంది !!

దిశ, ఫీచర్స్ : అసలే ఉరుకులు పరుగుల జీవితం.. ఉద్యోగంలో పని ఒత్తిడి, ప్రయాణంలో ఇబ్బందులతో అసిపోయి ఇంటికి వస్తుంటారు చాలామంది. దీంతో రెస్ట్ తీసుకుందామని బెడ్ రూమ్‌లోకి వెళ్లి పడుకుంటారు కానీ.. కంటిమీద కునుక రాక అవస్థలు పడుతుంటారు కొందరు. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం ఒకటుంది ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. నిద్రకు ఉపక్రమించే ముందు చలికాలం, వానకాలం అయితే గోరు వెచ్చని నీటితో, వేసవి అయితే చల్లని నీటితో స్నానం చేస్తే చాలు. బాగా నిద్రపట్టడంతోపాటు ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
2019లో స్లీప్ మెడిసిన్ రివ్యూ (Sleep Medicine Reviews)లో పబ్లిషైన ఒక మెటా-అనాలిసిస్, 17 అధ్యయనాలను సమీక్షించి, పడుకునే ముందు 1-2 గంటల ముందు వెచ్చని స్నానం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నది. అట్లనే 2021 నాటి జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ (Journal of Clinical Sleep Medicine) స్టడీలో భాగంగా1094 మంది వృద్ధులపై నిర్వహించిన పరిశోధనలో, పడుకోవడానికి ఒకటి 1 నుంచి 3 గంటల ముందు గోరు వెచ్చని స్నానం చేసిన వారు, స్నానం చేయనివారితో పోలిస్తే త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఇది వారి జీవన ప్రమాణం పెరుగుదలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. జర్నల్ ఆఫ్ సైకాలాజికల్ ఆంథ్రోపాలజీ( Journal of Physiological Anthropology) -2023 ప్రకారం కూడా నిద్రకోసం బెడ్ రూమ్‌లోకి వెళ్లేకంటే ముందు స్నానం చేయడం క్వాలిటీ స్లీప్‌ను పెంచుతుంది.
ప్రయోజనాలు
*పడుకోవడానికి 1 లేదా 2 గంటల ముందు(Bath before bed)40 నుంచి 42.5°C ఉష్ణోగ్రతలో 10 - 15 నిమిషాల పాటు వెచ్చని స్నానం చేయడం వల్ల నిద్ర ప్రారంభ జాప్యం (Sleep Onset Latency - SOL) తగ్గుతుంది, అంటే వ్యక్తులు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. అలాగే, నిద్ర సామర్థ్యం (Sleep Efficiency), నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతాయి. మంచి నిద్ర శరీరంలోని కణాల మరమ్మత్తు, హార్మోన్ నియంత్రణ, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇవన్నీ స్ట్రోక్, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యానికి, ఆయుష్షుకు దోహదపడతాయి.
*నిద్రకు ముందు వెచ్చని స్నానం కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనివల్ల కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ స్థాయిలు తగ్గడంవల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. అట్లనే మంచి నిద్ర మెటబాలిక్ సమస్యలుగా పేర్కొనే డయాబెటిస్, ఊబకాయం రిస్క్‌ను, తద్వారా స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా అరికడుతుంది.






