- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : రెండు గంటలకంటే ఎక్కువసేపు ఏమాత్రం కదలిక లేకుండా కుర్చీపై కూర్చుంటున్నారా? అయితే డేంజర్లో పడ్డట్టే. పైగా ఇది మీ ఆరోగ్యానికి సిగరెట్ తాగడం కంటే కూడా ఎక్కువ నష్టం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ‘కొత్త స్మోకింగ్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా గంటల తరబడి కుర్చీలో లేదా మరెక్కడైనా సరే కదలికలేకుండా కూర్చోవడం వల్ల శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ.. అంటే మెటబాలిజం మందగిస్తుంది. రక్త ప్రవాహం తగ్గుతుంది. కడుపు చుట్టూ కొవ్వు (Visceral fat) ఎక్కువగా పేరుకుపోతుంది. వెన్నెముక, కండరాలు బలహీనపడతాయి. గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబేసిటీ, క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి.
సిగరెట్ లాగానే కదలికలేని జీవితం, ముఖ్యంగా కుర్చీలో ఒకే దగ్గర కూర్చోవడం సైలెంట్ కిల్లర్ లాంటిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలామంది ఆఫీస్ వర్కర్స్, స్టూడెంట్స్, హోమ్‌మేకర్స్ రోజుకు 6 – 8 గంటలు కూర్చుంటూ ఉంటారు. అయితే వారు మధ్య మధ్యలో బ్రేక్ కూడా తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏమాత్రం కదలకుండా కూర్చుంటే మాత్రం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి, సాధారణకంటే కూడా 2–4 సంవత్సరాలు ఆయుష్షు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే మానవ శరీరం స్థిరంగా ఉండేలా రూపొందించబడి లేదు. కదలడానికే, నడవడానికే ఉద్దేశించినది.
నిపుణుల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే.. కుర్చీపై కదలిక లేకుండా గంటల తరబడి కూర్చొని ఉండవద్దు. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి 2 నుంచి 3 నిమిషాలు లేచి నిలబడటమో, వాకింగ్ చేయడమో, మరేదైనా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడమో చేయాలి. ఇలా చిన్న బ్రేక్స్ తీసుకోవడంవల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. మెటబాలిజం యాక్టివ్ అవుతుంది. కండరాలు బలపడతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది రోజువారీ అలవాటుగా మారితే “కొత్త స్మోకింగ్” నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.






