- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టిగా ఉండేవారికి గుండె సమస్యల రిస్క్ ఎక్కువ..! కారణమిదే..
పొట్టిగా ఉండే వ్యక్తుల్లో ఇరుకైన రక్తనాళాలు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్ల రక్తపోటు. ఇతర గుండె సంబంధిత సమస్యల రిస్క్ పెరుగుతుంది

దిశ, ఫీచర్స్ : ఎంత హైట్ పెరగాలనేది మన చేతిలో లేని విషయం. ఇది వంశ పారంపర్యంగా వచ్చే జెనెటిక్ చరిత్రను బట్టి కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇలా.. కారణాలేమైనా ఎక్కువ పొట్టిగా ఉండే వ్యక్తులకు, 5 అడుగలకంటే తక్కువ హైట్ ఉండేవారికి గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు (Cardiac problems) వచ్చే అవకాశం 32% ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ లిసెస్టర్ (University of Leicester) స్టడీ సహా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
పొట్టి వ్యక్తుల(shorter people)కు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఊపిరి తిత్తులు చిన్నగా ఉండి, తక్కువ ఫంక్షనల్ సామర్థ్యం కలిగి ఉండటం. ఇరుకైన రక్త నాళాలు, అలాగే గుండె, రక్త నాళాలపై అధిక ఒత్తిడి వంటివి శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా చేయడంలో తక్కువ సామర్థ్యం కనబరుస్తాయి. ఈ పరిస్థతి గుండెపై అదనపు భారం పడేలా చేస్తుంది. అదే విధంగా ఇరుకైన రక్తనాళాలు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్ల రక్తపోటు. ఇతర గుండె సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.
అయినప్పటికీ, హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవర్చుకోవడం పొట్టి వ్యక్తుల్లో కూడా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, ధూమపానం, మద్యపానం వంటి హానికరమైన అలవాట్లను నివారించడం వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. దీంతోపాటు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, గుండె సంబంధిత రిస్క్ ఫ్యాక్టర్‌లను పర్యవేక్షించడం, వైద్య సలహాలను పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






