స్వీయ సంభాషణలూ మేలు చేస్తాయి.. మెదడు పని తీరును మార్చడంలోనూ కీ రోల్..!

by Javid Pasha |   (  Updated:2025-10-03 10:23:37  IST  )

స్వీయ సంభాషణ, స్వీయ విమర్శ సాధారణంగా హానకరమని భావించినప్పటికీ, ఓవర్ కాన్ఫిడెన్స్‌ను తగ్గించి, అంతర్గత ప్రేరణను పెంచడం ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచడంలో సహాయపడుతుంది

స్వీయ సంభాషణలూ మేలు చేస్తాయి.. మెదడు పని తీరును మార్చడంలోనూ కీ రోల్..!
X

దిశ, ఫీచర్స్ : మనుషులు ఎదుటి వ్యక్తులతో సంభాషించడం మాత్రమే కాదు, తమలో తాము కూడా సంభాషించుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడో, నిద్ర పోతున్నప్పుడో, ప్రకృతిలో విహరిస్తున్నప్పుడో, పార్కులో కూర్చున్నప్పుడో ఇలా ఏదో ఒక సమయంలో అలా చేస్తుంటారు. దీనినే న్యూరో సైకలాజికల్ పరిభాషలో సెల్ఫ్ టాక్(Self-talk) అంటారు. అంటే.. ఇది మనసులో మాట్లాడుకునే అంతర్గత సంభాషణ. అయితే సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం.. ఈ విధమైన సెల్ఫ్‌టాక్ మెదడు పనితీరును మెరుగు పర్చడంలో, మానసిక స్థితిని మార్చడంలోనూ కీ రోల్ పోషిస్తుందని తెలిపింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనంలో భాగంగా నిపుణులు fMRI సాంకేతికతను ఉపయోగించి స్వీయ-సంభాషణ (Self-talk)కు సంబంధించిన పలు రూపాలను, అంటే.. స్వీయ గౌరవం (Self-respect) లేదా స్వీయ విమర్శ (Self-criticism) బ్రెయిన్ కనెక్టివిటీని పునర్మించి, మెదడు సామర్థ్యం(cognitive functioning)పై ఎలా ప్రభావం చూపుతుందో పరిశీలించారు. అయితే ఈ అంతర్గత సంభాషణలు ప్రేరణ ( motivation), శ్రద్ధ (attention), ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ (executive function)తో సంబంధం ఉన్న మెదడు నెట్‌వర్క్‌లలో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ను ఎలా మార్చయో గమనించారు.

స్వీయ సంభాషణపై జరిగిన అధ్యయన ఫలితాల్లో తేలిందేమిటంటే.. స్వీయ విమర్శ సాధారణంగా హానకరమని భావించినప్పటికీ, ఓవర్ కాన్ఫిడెన్స్‌ను తగ్గించి, అంతర్గత ప్రేరణను పెంచడం(increasing intrinsic motivation) ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచడంలో సెల్ఫ్ టాక్ సహాయపడింది. ఇది బ్రెయిన్ నెట్వర్క్‌లను శ్రద్ధగా, గోల్ ఓరియెంటెడ్‌గా పనిచేయడానికి ప్రేరేపించింది. అయితే ఇక్కడ ఏదీ అతి మంచిది కాదు. సెల్ఫ్ టాక్ కూడా అంతే. కాగా ఇది నార్మల్ స్టేజ్‌లో ఉన్నంత వరకు మాత్రం మంచిదేనని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఆత్మ విశ్వాసాన్ని, నిర్ణయాలలో కచ్చితత్వాన్ని పెంచడంలో, మెదడు చురుగ్గా పనిచేయడంలో, సానుకూల మానసిక స్థితిని మేనేజ్ చేయడంలో అంతర్గత స్వీయ సంభాషణలు కీ రోల్ పోషిస్తాయి.

Next Story