రాత్రిళ్లు ఆలస్యంగా తినేవారిలో పెరుగుతున్నఆ రిస్క్..! ఏం జరుగుతుదంటే..

by Javid Pasha |

రాత్రిళ్లు ఆలస్యంగా తినేవారిలో గ్లూకోజ్ రెగ్యులేషన్ పేలవంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రాత్రిళ్లు ఆలస్యంగా తినేవారిలో పెరుగుతున్నఆ రిస్క్..! ఏం జరుగుతుదంటే..
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే! ఎందుకంటే లేట్‌నైట్ ఈటింగ్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అబ్జర్వేషనల్ స్టడీస్ పేర్కొంటున్నాయి. తాజా అధ్యయనాల్లోనూ ఇది రుజువైంది. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత తినేవారిలో బాడీ ఫ్యాట్స్ అధికం అవుతాయని, అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తు్న్నాయి. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

గ్లూకోజ్ రెగ్యులేషన్..

రాత్రిళ్లు ఆలస్యంగా తినేవారిలో గ్లూకోజ్ రెగ్యులేషన్ (బ్లడ్ షుగర్ కంట్రోల్) పేలవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ రీసెర్చ్ (2022, Cell Metabolism)లో లేట్‌నైట్ ఈటింగ్ ఆకలిని పెంచి, కేలరీ బర్న్ తగ్గిస్తుందని, ఫ్యాట్ స్టోరేజ్ ప్రమోట్ చేస్తుందని తేలింది. ఇక నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ స్టడీస్ ప్రకారం.. ఆలస్యంగా తినడంవల్ల శరీర బరువు డబుల్ అవుతుంది. మెటబాలిజం స్లో అవుతుంది. ఫ్యాట్ ఆక్సిడేషన్ తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతుందని అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా ఇది సర్కాడియన్ రిథమ్ (Body clock)తో సంబంధం కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో మెటబాలిక్ రేట్ తక్కువగా ఉండటంవల్ల ఫుడ్ ఎనర్జీ ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ తగ్గుతుంది. అబ్జర్వేషన్ డేటా (PMC Studies 2008, 2020) ప్రకారం.. నైట్‌టైమ్ ఈటర్స్ ఎక్కువ కేలరీలు తీసుకోవడంవల్ల 3-4 సంవత్సరాల్లో 6 కేజీలకు పైగా బరువు పెరినట్లు తేలింది.

అధిక బరువు, డయాబెటిస్

మరో సమస్య ఏమిటంటే రాత్రిళ్లు ఆలస్యంగా తినడంవల్ల ఓవర్‌నైట్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ పెరిగి, ఫ్యాట్ మొబిలైజేషన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆకలి హార్మోన్స్ పెరిగి, ఫుల్ హార్మోన్(లెప్టిన్) తగ్గుతుంది. ఇది ఎక్కువ తినేలా చేస్తుంది. లేట్‌నైట్ డిన్నర్ తర్వాత ఫ్యాట్ బర్న్ 10% వరకు తగ్గుతుంది. రాత్రి ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవల్స్ 18% ఎక్కువగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి దారితీసి, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెంచుతుంది. కాబట్టి రాత్రి 10 గంటల తర్వాత కాకుండా 8 గంటలలోపు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని, ఇది మీ బరువను, డయాబెటిస్‌లను కంట్రోల్ చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు.

Next Story