Health Tips : ప్రెగ్నెన్సీలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారా?

by Javid Pasha |   (  Updated:2025-12-13 08:05:02  IST  )

రోజుకు సగటున 60 గ్రాముల చేపలను ఆహారంగా తీసుకునే గర్భిణులకు తెలివైన పిల్లలు పుడతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Health Tips : ప్రెగ్నెన్సీలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారా?
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ సమయంలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారని పెద్దలు చెబుతుంటారు. అధ్యయనాలు సైతం ఇది నిజమే అంటున్నాయి. చేపలు తినడంవల్ల మేధస్సు, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ మెరుగు పడుతుందని పేర్కొంటున్నాయి. డానిష్ నేషన్ బర్త్ కోహార్ట్ అధ్యయనం(1997-2002)లో భాగంగా 25,446 పిల్లలపై చేసిన పరిశోధనలోనూ ఇది వెల్లడైంది. అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల ప్రకారం.. రోజుకు సగటున 60 గ్రాముల చేపలను ఆహారంగా తీసుకున్న గర్భిణులకు జన్మించిన పిల్లలు సాధారణకంటే ఎక్కువస్థాయిలో, వేగంగా కాళ్లు చేతులు కదిలించడం, తలను పట్టుకోవడం వంటి మోటార్ స్కిల్స్‌ను, అలాగే శబ్దాలకు వెంటనే స్పందించడం, పదాలు ఉపయోగించడం వంటి కాగ్నిటివ్ స్కిల్స్‌ను ప్రదర్శించారు. అయితే చేపలు తిననివారితో లేదా తక్కువ చేపలు తిన్నగర్భిణులతో పోలిస్తే ఈ నైపుణ్యాలు 25-30% మెరుగైన స్కోర్లు సాధించాయి.

జపాన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ చిల్డ్రన్స్ స్టడీ (JECS)లో భాగంగా 2024లో 91,909 మదర్-చైల్డ్ జంటల(mother-child pairs)పై చేసిన అధ్యయనంలో కూడా అధిక చేపలు తిన్న తల్లులకు పుట్టిన పిల్లలు 3 సంవత్సరాల వయసులో ఫైన్ మోటర్, ప్రాబ్లమ్-సాల్వింగ్, అలాగే పర్సనల్-సోషల్ స్కిల్స్‌ మెరుగుదల అధికంగా నమోదైంది. పైగా న్యూరోడెవలప్‌మెంటల్ డిలేస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇందంతా ఎందుకు జరుగుతుందంటే చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (DHA, EPA), అయోడిన్ అండ్ హై-క్వాలిటీ ప్రోటీన్ వంటివి గర్భంలోని పిండం, అలాగే మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ అండ్ లెర్నింగ్‌ను బలపరుస్తాయి అంటున్నారు పరిశోధకులు. అయితే కేవలం చేపలు తినడం ఒక్కటే ఇక్కడ ప్రాధాన్యత కాదని, చేపల్లోని పోషకాలు అందుకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో పోషకాహారంతోపాటు జన్యువులు, పర్యావరణం, తల్లి ఆరోగ్యం వంటి అనేక ఫ్యాక్టర్లు కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, తెలివితేటలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.

Next Story