- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : మెనోపాజ్ దశలో జ్ఞాపక శక్తి తగ్గుతుందా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..?
Health : మెనోపాజ్ దశలో జ్ఞాపక శక్తి తగ్గుతుందా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..?

దిశ, ఫీచర్స్ : మెనోపాజ్.. ప్రతీ స్త్రీ జీవితంలో ఇదొక సహజమైన దశ. రుతు చక్రాలు(Menstrual cycles) శాశ్వతంగా ఆగిపోతాయి. సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో ఈ దశ సంభవిస్తుంది. అయితే అందరికీ ఇది ఒకేలా వర్తించదు. ఏజ్ పరంగా సంఖ్య కొంచెం అటూ ఇటూగా మారవచ్చునని కూడా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మెనోపాజ్ మహిళల్లో సహజమైన శారీరక మార్పు అయినప్పటికీ, ఈ దశలో జ్ఞాపక శక్తి తగ్గుతుందని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది వాస్తవం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి.
మెనోపాజ్ ఒక శారీరక మార్పు తప్ప వాస్తవానికి జ్ఞాపక శక్తి తగ్గుదల సంకేతం ఏమాత్రం కాదంటున్నారు నిపుణులు. పైగా ఈ స్టేజ్ మెదడును భావోద్వేగ బలం(Emotional strength), స్థిరత్వం, ఒక విషయంలో క్లారిటీ కోసం పునర్వ్యవస్థీకరించే ప్రాసెస్ అని చెబుతున్నారు. పెరిమెనోపాజ్ (రుతు చక్రాలు క్రమ రహితంగా మారేదశ) సంభవించే దశలో మాత్రం మెదడు గందరగోళం(brain fog), జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక హెచ్చుతగ్గులు సాధారణంగా వచ్చిపోతుంటాయి. తప్ప అవి మెదడు క్షీణతకు లేదా జ్ఞాపక శక్తి తగ్గుదలకు శాశ్వత సంకేతాలు కావంటున్నారు న్యూరో సైంటిస్టులు.
అధ్యయనాల ప్రకారం.. మెనోపాజ్ తర్వాత మెదడు తరచుగా మరింత సమర్థవంతంగా మారుతుంది. భావోద్వేగపరమైన స్థిరత్వం అలవడుతుంది. ముఖ్యంగా మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం (అమిగ్డాలా)లో ప్రతిస్పందన తగ్గుతుంది. దీనివల్ల భావోద్వేగ అస్థిరత (Emotional instability) కూడా తగ్గుతుంది. చాలా మంది మహిళలు మెనోపాజ్ తర్వాత మరింత ఆత్మవిశ్వాసంగా ఉంటారని, సానుభూతి, శాంతియుత మనస్తత్వాన్ని అనుభవిస్తారని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ అనుభవాలు కేవలం వ్యక్తిగత భావనలు మాత్రమే కాదు, మెదడు స్కాన్‌లు ఈ మార్పులను ధృవీకరిస్తున్నాయని కూడా బ్రిన్టన్ ఆర్.డి. (2019) అధ్యయనం (PMC6674699) పేర్కొన్నది.
స్త్రీలలో మెనోపాజ్ దశ సమయంలో మెదడు ఈస్ట్రోజెన్ స్థాయిల మార్పులకు అనుగుణంగా తన పనితీరును సర్దుబాటు చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మరింత మెరుగైన తెలివితేటలకు, ఆత్మ విశ్వాసానికి, మెదడు సామర్థ్యానికి(For cognitive ability)దారితీస్తుంది. అదేవిధంగా. గ్రీన్‌డేల్ జి.ఎ. (2021) అధ్యయనం (PMID: 34108509) కూడా మెనోపాజ్ తర్వాత మహిళలు భావోద్వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. విషయాలపట్ల స్పష్టమైన ఆలోచనలకు అనుగుణంగా మెదడులో వచ్చే మార్పులు ఇందుకు కారణం. అంటే మెనోజ్ పాజ్‌దశ అనేది మహిళల్లో లోతైన భావోద్వేగ అవగాహనను(Deep emotional awareness), స్థిరత్వాన్ని, స్పష్టతను ఏర్పరుస్తుంది. జీవితంలో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. అంతే తప్ప మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి అపోహలకు, మెనోజ్ పాజ్‌కు సంబంధం లేదంటున్నారు నిపుణులు.






