- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధాప్యం త్వరగా రాకూడదంటే.. బహుళ భాషలు నేర్చుకోండి!!
బహుళ భాషలు మాట్లాడే వ్యక్తుల్లో దీర్ఘాయుష్షు ఎందుకు పెరుగుతుందంటే.. ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్ ఉపయోగించే వ్యక్తుల మెదడులో కాగ్నిటివ్ రిజర్వ్(cognitive reserve) అనే రక్షణ పొర ఎక్కువగా ఏర్పడుతుంది.

దిశ, ఫీచర్స్ : భావ వ్యక్తీకరణలో, సంభాషణల్లో మనం మాట్లాడే భాష కీ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసెందే. సాధారణంగా ప్రతి ఒక్కరికీ తమ మాతృభాష తప్పక వస్తుంది. అయితే చదువుకున్నవారు పలు అదనపు భాషలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అరుదుగా కొందరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తోపాటు అనేక ఇతర భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పడం అనుకుంటున్నారా? మరేం లేదు ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం బహుళ భాషలు మాట్లాడేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తేల్చాయి. మల్టీపుల్ లాంగ్వేజెస్ నేర్చుకునే వారిలో మిగతా వారితో పోలిస్తే మెదడు వృద్ధాప్యం (brain aging) గణనీయంగా తగ్గిందని పేర్కొన్నాయి.
బహుళ భాషలు మాట్లాడే వ్యక్తుల్లో దీర్ఘాయుష్షు ఎందుకు పెరుగుతుందంటే.. ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్ ఉపయోగించే వ్యక్తుల మెదడులో కాగ్నిటివ్ రిజర్వ్(cognitive reserve) అనే రక్షణ పొర ఎక్కువగా ఏర్పడుతుంది. దీని వల్ల అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులు ఆలస్యంగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో 4 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఆలస్యం అవుతాయని పరిశోధనలు నిరూపించాయి. ఎందుకంటే రెండు భాషల మధ్య తరచూ మార్పులు ప్రాసెస్ అయ్యే ప్రక్రియ(language switching) వల్ల మెదడులోని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, అంటే నిర్ణయాలు తీసుకోవడం, దృష్టి నిలుపడం, సమస్యలు పరిష్కరించడం వంటి కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతూ, వ్యాయామం చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి జ్ఞాపకశక్తి (memory), ఏకాగ్రత (attention), ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందిస్తాయి. ఇవన్నీ మెదడు సామర్థ్యాన్ని పెంచి, దానిని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా వృద్ధాప్య కణాల క్షీణత తగ్గుతుంది.
అధ్యయనాల ప్రకారం.. ప్రతీ కొత్త భాష నేర్చుకోవడం వల్ల మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇప్పటికే ఉన్న నాడీ మార్గాలు (neural pathways) మరింత బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. అందుకే భాష నేర్చుకోవడం కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదు. అది మీ మెదడు వృద్ధాప్యాన్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన “యాంటీ-ఏజింగ్ వర్కౌట్” అంటున్నారు నిపుణులు. ఇప్పటికే రెండు భాషలు వచ్చి ఉండి, మీరు కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రతీ పదం, ప్రతీ వాక్యం మీ మెదడును ఎక్కువ కాలం యవ్వనంగా, యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకెందుకాలస్యం.. ఆసక్తి ఉంటే బహుళ భాషలు నేర్చుకునే ప్రయత్నం ప్రారంభించండిక! Link






