- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిపాలతో సమానమైన పోషకాలు.. మేకపాలల్లోనూ ఉంటాయి తెలుసా!?
ఆవుపాలతో పోలిస్తే మేకపాలు ఎక్కువ బలాన్ని, ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

దిశ, ఫీచర్స్ : మేక పాలల్లో (goat’s milk) బ్రెస్ట్ మిల్క్‌తో సమానమైన పోషకాలుంటాయా? శిశువులకు మేలు చేస్తాయా? అవుననే అంటున్నాయి శాస్త్రీయ అధ్యయనాలు. పైగా వీటిని ‘యూనివర్సల్’ సూపర్ ఫుడ్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. జర్నల్ ఆఫ్ అగ్రికల్చ్ అండ్ ఫుడ్ సైన్స్ సహా, కొన్ని మెటా ఎనాలిసిస్ గత అధ్యయనాలు సైతం ఇదే పేర్కొన్నాయి. తల్లిపాలతో పోలిస్తే మేకపాలలో ప్రోటీన్ నిర్మాణం, కొవ్వు కణాలు(small fat globules), కొన్ని ప్రీబయోటిక్ ఒలిగోసాకరైడ్స్ వంటివి అధిక సారూప్యంగా ఉంటాయని, కొన్ని ప్రీబయోటిక్ ఒలిగోసాకరైడ్స్ ఎక్కువ సారూప్యంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుందని స్పష్టం చేశాయి. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేక పాలల్లో ఏ2(A2) బీటా-కేసిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటంవల్ల సాధారణ ఆవుపాలల్లోని ఏ1(A1) ప్రోటీన్ కంటే కడుపులో తక్కువ ఇబ్బందిని కలిగిస్తాయని, జీర్ణ సమస్యలు ఉణ్నవారికి, డెయిరీ ఆల్టర్నేటివ్‌గా వీటిని ఉపయోగించవచ్చునని అధ్యనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మేకపాలల్లో బయో-అవైలబిలిటీ, అంటే శరీరం ఈజీగా గ్రహించగలిగే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉండటంవల్ల విటమిన్లు (A, B2, B12 వంటివి), కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఆవుపాలతో పోలిస్తే మేక పాలలో కొవ్వు కణాలు కూడా చిన్నగా ఉండటంవల్ల పిల్లలకు ఆహారంగా ఇచ్చినప్పుడు సులభంగా జీర్ణం అవుతాయి. ఐరన్, కాపర్ వంటి మనిరల్స్ అందుతాయి.
అంతేకాకుండా ఆవుపాలతో పోలిస్తే మేకపాలు ఎక్కువ బలాన్ని, ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సాంస్కృతిక పరంగానూ మేకపాలు శతాబ్దాలుగా ‘హీలింగ్’ మిల్క్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాగనీ మేకపాలు అందరికీ సరిపడతాయని కూడా చెప్పలేం. శరీర తత్వాన్ని బట్టి వ్యక్తిగత ప్రయోజనాలు మారవచ్చు. కాబట్టి డాక్టర్ల సలహాతో మాత్రమే వీటిని ఉపపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి పడకపోతే, ముఖ్యంగా లాక్టోస్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏర్పడవచ్చు. కానీ ఇది అరుదుగా ఎదురయ్యే చిన్న సమస్య మాత్రమే. ఓవరాల్‌గా గట్ ఫ్రెండ్లీ అండ్ పోషక సమృద్ధమైన డెయిరీ(utrient-rich dairy) ఆల్టర్నేటివ్‌గా శక్తివంతమైన ఎంపికగా నిలుస్తాయి. అయితే వీటన్నింటికంటే కూడా తల్లిపాలే సురక్షితమైనవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు.






