అల్లం.. ఆ సమయంలో వాడితే.. ఆ నొప్పి మాయం!

by Javid Pasha |   (  Updated:2025-10-25 12:43:56  IST  )

అల్లంలో జింజరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నెలసరి సమయంలో మహిళల్లో నొప్పి కలిగించే రసాయనాల ఉత్పత్తిని 30-40% తగ్గిస్తుంది.

అల్లం.. ఆ సమయంలో వాడితే.. ఆ నొప్పి మాయం!
X

దిశ, ఫీచర్స్ : మన ఇండ్లల్లో ప్రతిరోజూ వంటకాల్లో వాడే అల్లం గురించి అందరికీ తెలిసిందే. కానీ అది కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మీకు తెలుసా? ముఖ్యంగా ఇది మహిళల్లో పీరియడ్స్ నొప్పిని తగ్గిండచంలో కూడా ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అంటున్నారు. జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్(2014), 150 మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

1. పీరియడ్ నొప్పి తగ్గుతుంది

అల్లంలో జింజరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నెలసరి సమయంలో మహిళల్లో ప్రోస్టాగ్లాండిన్స్ (నొప్పి కలిగించే రసాయనాలు) ఉత్పత్తిని 30-40% తగ్గిస్తుంది. కాబట్టి ఆ సమయంలో అల్లం కషాయం తాగడం లేదా తేనెలో లేదా చక్కెరలో అల్లం ముక్కలు కలిపి తినడం వంటివి చేయాలని పెద్దలు, నిపుణులు సూచిస్తుంటారు.

2. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి

అల్లం ఈస్ట్రోజెన్ & ప్రొజెస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. PCOS ఉన్నవారికి ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. ఫైటోథెరపీ రీసెర్చ్ (2018) ప్రకారం.. రోజుకు 2 గ్రాముల అల్లం 12 వారాలు కషాయం లేదా తేనెలో కలిపి ఇలా ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం వల్ల PCOS మహిళల్లో హార్మోన్ బ్యాలెన్స్ 25% మెరుగైంది.

3. బ్లోటింగ్ & క్రాంప్స్ తగ్గుతాయి

*మరో ముఖ్య విషయం ఏంటంటే.. అల్లం గ్యాస్ట్రిక్ మోటిలిటీ (Digestive system) పెంచి, ఉబ్బరం తగ్గిస్తుంది. కండరాల రిలాక్సేషన్ ద్వారా క్రాంప్స్ తగ్గుతాయి.

*జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ (2020) ప్రకారం.. జింజర్ టీ రోజుకు 2 సార్లు తాగితే పీరియడ్స్ బ్లోటింగ్ 50% తగ్గుతుంది.

4. మూడ్ & ఎనర్జీ బూస్ట్

*జింజర్ సెరోటోనిన్ & డోపమైన్ స్థాయిలను పెంచి, మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది. అలసట తగ్గి శక్తి పెరుగుతుంది.

*జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ (2019) అధ్యయనం ప్రకారం.. 1 గ్రామ్ జింజర్ 10 రోజులు తీసుకోవడంవల్ల పీఎంఎస్ (premenstrual syndrome) మూడ్ స్కోర్ 35% మెరుగవుతుంది. కాబట్టి నెలసరి సమయంలో రిలీఫ్ అవ్వాలంటే మహిళలు అల్లం కషాయం లేదా వివిధ రూపాల్లో దానిని ఆహారంగా తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. Link

Next Story