మనసు మాట వినదు.. కానీ అమ్మ మార్చగలదు..!

by Javid Pasha |

చిన్న పిల్లలతో పోలిస్తూ టీనేజర్లను మేనేజ్ చేయడం తల్లిదండ్రులకు కొంత కష్టమే. అయినప్పటికీ అమ్మ ప్రేమ వారిని మనసు మార్చగలదని, మంచి భవిష్యత్తుకు బాటలు వేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనసు మాట వినదు.. కానీ అమ్మ మార్చగలదు..!
X

దిశ, ఫీచర్స్ : అన్నీ తెలిసిన వయసు కాదు. అలాగనీ ఏమీ తెలియని వయసు కూడా కాదు. అదే టీనేజ్. కొన్నిసార్లు అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది. మరొకొన్ని సార్లు తమకేమీ తెలియదేమోననే అనుమానం వేధిస్తుంది. ఓ వైపు ఉరకలెత్తే ఉత్సాహం తరుముకొస్తుంటే.. మరోవైపు దానికి అడ్డుకట్టవేసే కుటుంబ నిబంధనలో, సామాజిక నిబంధనలో వెంటాడుతుంటాయి. ఇలాంటప్పుడే ఎటూ తేల్చుకోలేని రకరకాల ఆలోచనలతో యువ మనసులు సతమతం అవుతుంటాయి. సరిగ్గా ఇలాంటప్పుడే అమ్మప్రేమ వారి మనసును మార్చడంలో కీ రోల్ పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన నిపుణుల అధ్యయనం వెల్లడించింది. అదెలాగో చూద్దాం.

*చిన్న పిల్లలతో పోలిస్తూ టీనేజర్లను మేనేజ్ చేయడం తల్లిదండ్రులకు కొంత కష్టమే. అయినప్పటికీ అమ్మ ప్రేమ వారిని మనసు మార్చగలదని, మంచి భవిష్యత్తుకు బాటలు వేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో శారీరక మార్పులు, పరిపక్వత లేని మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో అమ్మకు మించిన నిపుణులు లేరంటున్నారు పరిశోధకులు. సాధారణంగా టీనేజ్ పిల్లలు తండ్రికంటే తల్లితో ఎక్కువ చొరవ కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ వారి మనసును మార్చడంలో అమ్మపాత్ర కీ రోల్ పోషించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

*తల్లి తన పిల్లలతో సురక్షితమైన, సానుకూల సంబంధాన్ని నిర్మించడంలో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పైగా పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా వెంటనే అర్థం చేసుకోవడం ద్వారా, సామాజిక, భావోద్వేగ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుంది. అంతేకాకుండా పిల్లలకోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, సానుభూతితో స్పందించడం టీనేజర్లలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థిరత్వం పెరుగుతాయి. ముఖ్యంగా తల్లి ఎమోషనల్ సపోర్ట్ టీనేజర్లలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గిస్తుంది.

*తల్లులు తమ టీనేజర్ల ప్రవర్తను నియంత్రించడంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. మంచి మార్గంవైపు నడిపిస్తుంటారు. నైతిక విలువలను బోధిస్తుంటారు. అయితే ఇవన్నీ పిల్లలకు ఇతరులు చెప్పేకంటే తల్లి చెప్పే పద్ధతి భిన్నంగా ఉంటుంది. అది వారిని ఆకట్టుకుంటుంది. ఇవి టీనేజర్లలో స్వీయ-నియంత్రణ(Self-control), బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. దీనికి భిన్నంగా అతిగా నియంత్రించే (restrictive) లేదా కఠినమైన పెంపకం టీనేజర్లలో ప్రతికూల ప్రవర్తనలకు దారితీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* పిల్లలతో మాట్లాడే క్రమంలో తమ సంతానం వ్యక్తిగత ఎదుగుదల, శారీరక మార్పులు, సమాజంలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ తల్లులు జాగ్రత్తలు చెబుతుంటారు. ఈ విధమైన సంభాషణలు, ఆలోచనాత్మక చర్చలు టీనేజర్లలో అలర్ట్‌నెస్‌ను, భాషా నైపుణ్యాలను, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుస్తాయి. ఇవన్నీ కలిసి వారి మనసును మార్చేస్తాయి. విచక్షణగా ఆలోచించేలా చేస్తాయి. ఇదే మిగతా వాళ్లు చెబితే అంత తొందరగా టీనేజర్లు వినిపించుకోరు. కానీ తల్లి చెబితే పట్టించుకోనట్టు అనిపిస్తుండవచ్చు కానీ. అమ్మలోని ఆప్యాయత, పిల్లల మేలు కోరే చిన్న చిన్న కోపాలు, పనిష్మెంట్లు వారి మనసును మార్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story