- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Luxury Life : ధనికులకంటే పేదోళ్లే నయం కదా..! లగ్జరీ కొనుగోళ్లలో 75% మిడిల్ క్లాస్‌దే హవా!!
Luxury Life : ధనికులకంటే పేదోళ్లే నయం కదా..! లగ్జరీ కొనుగోళ్లలో 75% మిడిల్ క్లాస్‌దే హవా!!

దిశ, ఫీచర్స్ : చూడ్డానికి పేదోళ్లే కానీ గుణంలో మాత్రం పెద్ద మనసున్నోళ్లు అంటుంటారు పెద్దలు. పేద, మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించి ఇలా చెబుతుంటారు. అయితే మంచి మనసు, గుణంలో మాత్రమే కాదండోయ్.. తమదైన పద్ధతిలో లగ్జరీ లైఫ్‌ను అనుభవించడంలోనూ మిడిల్ క్లాస్ ప్రజలు ధనికులను మించిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ లగ్జరీ కొనుగోళ్లలో అత్యధికశాతం మధ్య తరగతి లేదా తక్కువ ఆదాయ వినియోగదారులే చేస్తున్నారని పేర్కొంటున్నాయి. వస్తు వ్యామోహం, వినిమయ సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి అధిక ఆదాయం కలిగిన ధనిక కుటుంబాల్లో చాలా వరకు దేనికీ లోటుండదు. విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తుంటారు. అయితే లగ్జరీ లేదా బ్రాండెడ్ వస్తువుల కొనుగోలు విషయంలో మాత్రం వీరు అవసరం మేరకే కొనుగోలు చేస్తుంటారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మళ్లీ మళ్లీ పర్చేస్ చేయడానికి, మార్కెట్‌లో వచ్చిన ప్రతీ విలాసవంతమైన వస్తువును అవసరం లేకున్నా కొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మిడిల్ క్లాస్ జనం మాత్రం అలా కాదు. కంటికి, మనసుకు నచ్చితే చాలు అప్పు చేసైనా సరే తమ స్థాయికి మించిన బ్రాండ్లను, వస్తువులను కొనుగోలు చేయడానికి వీరు మొగ్గు చూపుతుంటారని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వారిలో సుమారు 75% మంది మిడిల్ క్లాస్ లేదా తక్కువ ఆదాయం కలిగిన వారే ఉంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. కాగా వీరి వార్షిక ఆదాయం సుమారుగా రూ. 33 లక్షలు ($40,000), అంతకంటే తక్కువే ఉంటున్నట్లు పేర్కొన్నది. దీనిని బట్టి ఈరోజుల్లో లగ్జరీ బ్రాండ్లు కేవలం ధనిక వర్గానికే కాకుండా, మధ్యతరగతి ప్రజలకు కూడా చేరువ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పేద, మధ్య తరతగతి ప్రజల్లోని బలహీనతలు, ఆసక్తులు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా కంపెనీలు, బ్రాండ్లు తమ మార్కెటింగ్ విధానాలను అవలంభిస్తున్నాయి. ప్రతీ తరగతిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వ్యక్తిగత సంతృప్తి, నలుగురితో పోల్చుకోవడంలో తాము హై స్టేటస్ సింబాలిక్‌గా ఉండాలనే వస్తు వినిమయ సంస్కృతి భావజాలానికి ప్రభావితం అవుతున్న పేద, మధ్య తరగతి ప్రజలే ఈ విషయంలో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.






