- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 నిమిషాల కోపం.. 6 గంటలు అధిక వృద్ధాప్యంతో సమానం..! ఏ విధంగా అంటే..?

దిశ, ఫీచర్స్ : తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు.. సైన్స్ కూడా అదే పేర్కొంటున్నది. కోపం మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నది. అప్పుడప్పుడూ వచ్చే సాధారణ కోపం మానవ సహజ లక్షణం కావచ్చు. కానీ తరచుగా కోపం వస్తోందంటే అది కచ్చితంగా మీలో అనారోగ్యానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5 నిమిషాల తీవ్రమైన కోపం 6 గంటల మెదడు వృద్ధాప్యానికి దారితీస్తుందని ‘జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్’లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.
*కోపం వచ్చినప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత కోల్పోతారు. అంతేకాదు అది గుండె ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపంలో స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల మెదడు కణాలను దెబ్బతీస్తుంది కాబట్టి దీర్ఘకాలంలో మెదడు పనితీరు తగ్గడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
*కోపం వల్ల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్రభావితం అవుతుంది. ఇది నిర్ణయాత్మక ఆలోచనను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి కోపంలో ఉన్న వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆవేశ పూరిత నిర్ణయాలతో అవస్థలు పడతారు.
*తరచూ కోపం తెచ్చుకునే అలవాటు రక్తపోటును, గుండె స్పందన రేటును పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీర్ఘకాలిక కోపం ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది, ఇవి మెదడు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. ప్రధానంగా కోపంలో రిలీజ్ అయ్యే స్ట్రెస్ హార్మోన్లు మెదడులోని టెలోమీర్లను (కణాల వృద్ధాప్యాన్ని నియంత్రించే డీఎన్ఏ భాగాలు) క్షీణింపజేస్తాయి. కాబట్టి ఇది మెదడు కణాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. అందుకే 5 నిమిషాల కోపం ఆరు గంటల వృద్ధాప్యానికి సమానమని ఆరోగ్య నిపుణులు, సైంటిస్టులు చెబుతున్నారు. వాదనకు మూలం కావచ్చు.






