- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ 20 నిమిషాలు ఇలా స్పెండ్ చేస్తే చాలు.. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మీ శరీరంలో జరిగే అద్భుతాలివే..
జస్ట్ 20 నిమిషాలు ఇలా స్పెండ్ చేస్తే చాలు.. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మీ శరీరంలో జరిగే అద్భుతాలివే..

దిశ, ఫీచర్స్ : అనారోగ్యం చేసినప్పుడు ఇబ్బందులు భరించలేక ఆప్పత్రులకు వెళ్తుంటారు. కానీ అసలు అనారోగ్యాలకు గురికాకుండా తీసుకునే జాగ్రత్తల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు మనలో చాలా మంది. ఇదే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి లోపం, ఆ తర్వాత తలెత్తే పలు ఆరోగ్య సమస్యల విషయంలో చాలా వరకు ఇదే జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కేవలం 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మికి గురైతే చాలు, శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. దీనివల్ల దాదాపు 200 రకాల రోగాలు దరిచేరకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
* డైలీ ఉదయం పూట 20 నిమిషాలు ఎండలో గడిపితే శరీరానికి తగిన విటమిన్ డి లభిస్తుంది. ఇది బాడీలో యాంటీమైక్రోబియల్ పెప్టైడ్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇవి హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నివారణలో కూడా సహాయపడుతుంది.
* గాయాల సందర్భంలో విటమిన్ డి నొప్పి, మంట(inflammation)వంటి వాటిని సమతుల్యం చేస్తుంది. త్వరగా తగ్గేలా చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో పబ్లిషైన ఒక స్టడీ ప్రకారం.. విటమిన్ డి లోపం ఆటో ఇమ్యూన్ వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. శరీరంలో తగినంగా ఈ విటమిన్ కలిగి ఉన్నప్పుడే రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపడుతుంది. శరీరం రోగాల బారిన పడకుండా సమర్థవంతంగా రక్షణ విధానాన్ని నిర్వహిస్తుంది.
*సూర్యరశ్మిని పొందడంవల్ల శరీరం గ్రహించే విటమిన్ డి సహజ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మొదటి రక్షణ గోడ(first defensive wall)గా పనిచేస్తుంది. యూసీ శాన్ డియాగో అధ్యయనాల ప్రకారం.. విటమిన్ డి సరైన స్థాయిలలో ఉంటే శ్వాసకోశ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ రుగ్మతల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే ఇది రోగనిరోధక కణాలను యాక్టివేట్ చేసి, వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. Link






