- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : బలమైన స్నేహ బంధాలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఇవి పరోక్షంగా ఫిజికల్ హెల్త్‌పై సానుకూల ప్రభావం చూపుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడమియాలజీ నిపుణుల అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుందని చెప్పింది. అంతేకాకుండా సన్నిహిత సామాజిక సంబంధాలు కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. వివిధ అనారోగ్యాల నుంచి రికవరీ రేటును వేగవంతం చేస్తాయి. కాగా బలమైన స్నేహం మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరీశీలించిన అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఎలా జరుగుతుందంటే..
జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ(Journal of Clinical Oncology) అధ్యయనాలు కూడా బలమైన స్నేహాలు కేవలం మనసుకు సంబంధించినవి మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యానికి సైతం చాలా మేలు చేస్తాయి. ఉదాహరణకు స్నేహితులతో కలిసి గడపడం వల్ల రక్తపోటు తగ్గుతుంది శరీరంలో పలు సమస్యకు కారణం అయ్యే ఇన్‌ఫ్లమేషన్(వాపు)తగ్గుతుంది. డిప్రెషన్ రిస్క్ కూడా 50% వరకు తగ్గుతుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే.. స్నేహాలు ఆక్సిటోసిన్ (లవ్ హార్మోన్)ను పెంచి, ఒంటరితనం వల్ల వచ్చే హానికర ఎఫెక్ట్స్‌ను నిరోధిస్తాయి.
తగ్గుతున్న క్యాన్సర్
అయితే పురుషులకంటే కూడా స్త్రీల విషయంలో ఇది మరింత ప్రభావ వంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరు ఎక్కువమంది మహిళలతో బలమైన స్నేహ సంబంధాలు కలిగి ఉండటం, వారితో సరదాగా మాట్లాడటం, విషయాలు షేర్ చేసుకోవడం వంటివి క్యాన్సర్, అలాగే హార్ట్ డిసీజెస్ రికవరీరేటును 2 రెట్లు పెంచినట్లు అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ బలమైన సపోర్ట్ నెట్వర్క్‌లా ఉంటారు. అందుకే వ్యాయామాలు, హెల్తీ ఈటింగ్ కంటే కూడా బలమైన స్నేహాలు ఎక్కువ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయని, డెత్ రిస్క్‌ను 50% తగ్గిస్తాయని బ్రిఘం యూనివర్సిటీ అధ్యయనం కూడా చెబుతోంది. Link






