- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : రాత్రిళ్లు బ్రష్ చేయడం మానేస్తున్నారా..? మీ గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే!

దిశ, ఫీచర్స్ : నోటి పరిశుభ్రతలో భాగంగా మనం ఉదయం పూట, అలాగే రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకుంటాం. అయితే కొందరు కేవలం మార్నింగ్ మాత్రమే బ్రష్ చేస్తుంటారు. రాత్రిపూట ఎందుకులే అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యమే మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
*రాత్రిళ్లు బ్రష్ చేయడం మానేస్తే కేవలం నోటి దుర్వాసనే కాదు, ఇతర అనారోగ్యాలు సైతం దాడిచేస్తాయి. ఎందుకంటే ఉదయం బ్రష్ చేసిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఆహారం తింటుంటాం. వివిధ పదార్థాలు, వాటిలోని బ్యాక్టీరియాలు పళ్ల సందుల్లోకి చేరుతుంటాయి. వీటిలో హానికర బ్యాక్టీరియాలు సైతం ఉంటాయి. అవి నోటి ద్వారా రక్తనాళాల్లోకి చేరి, గుండె జబ్బులు (Cardiovascular Diseases) వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి.
*ముఖ్యంగా చిగుళ్ల వాపు (Gum disease) లేదా పీరియాడాంటైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు రెండు పూటల బ్రష్ చేయకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే పళ్లమధ్యలోకి చేరిన హానికారక బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి, ధమనులలో ఇన్‌ఫ్లేమేషన్‌కు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే గుండెపోటు లేదా స్ట్రోక్ రావడానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*నోటి పరిశుభ్రత కేవలం దంత సంరక్షణే కాదు, పరోక్షంగా అది మీ గుండెను కూడా రక్షిస్తుంది. అందుకే రోజుకు రెండుసార్లు, అంటే.. ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవాలి అంటున్నారు నిపుణులు. కనీసం ఆరు నెలలకోసారి దంతవైద్యులను సంప్రదించి చెకప్ చేయించుకుంటే బెటర్. ఈ విధమైన అలవాట్లు, పరిశుభ్రత మీ దంతాల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా గుండె జబ్బులను నివారించడంలో పరోక్షంగా సహాయపడుతుందని నిపుణులు అంటుటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






