- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kohli-Simbu: సింహాన్ని చూసినట్లు ఉంది.. కోహ్లీపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
Kohli-Simbu: సినీహీరోలకు క్రికెటర్లకు మధ్య అనుబంధం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Kohli-Simbu: సినీహీరోలకు క్రికెటర్లకు మధ్య అనుబంధం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. తాజాగా స్టార్ క్రికెటర్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు శింబు నటించిన ఓ మూవీలోని పాట అంటే ఇష్టమని చెప్పారు. దీనికి హీరో స్పందించారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సినీ, క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. శింబు నటించిన పాథాథాలా మూవీలోని నీ సింగం దాన్ అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని విరాట్ కోహ్లీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఆ పోస్టును రీ షేర్ చేశారు శింబు. నువ్వు నిజంగానే సింహానివి అంటూ విరాట్ కోహ్లీని ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
కాగా ఎప్పటి నుంచో విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో స్టార్ క్రికెటర్ పాత్రలో శింబు నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ హీరో అచ్చం కోహ్లీ వలే గడ్డం పెంచడంతో ఆ వార్తలకు ఊతం ఇచ్చినట్లు అయ్యింది. కాగా విరాట్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ ఇప్పటికే బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇదెలా ఉండగా..ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వరుస హాఫ్ సెంచరీలతో రన్ మెషీన్ సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచులాడి 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 5వ స్థానంలో ఉన్నాడు.
Nee singam dhan @imVkohli ❤️🔥🦁 https://t.co/qVwdmnLusi
— Silambarasan TR (@SilambarasanTR_) May 1, 2025






