- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ ఉద్యోగం వదిలి ఆవుల్ని పెంచారు.. కట్ చేస్తే.. రూ. 2 కోట్ల టర్నోవర్..!
అది 2014 సంవత్సరం శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. దీంతో అతని ఆలోచలో మరింత మార్పు వచ్చింది. డబ్బుకంటే ప్రశాతంగా, ఆరోగ్యంగా బతకడం మేలని భావించాడు.

దిశ, ఫీచర్స్ : ఆకర్షణీయమైన ఉద్యోగం, ఐదంకెల జీతం కదా అని కొందరు ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతుంటారు. అధిక ఆదాయం వస్తుందని ఆశ పడతారు. కష్టాలు ఎదురైనా అదే ఉద్యోగంలో కొనసాగుతుంటారు. అలాగనీ.. అందరూ అట్లనే ఉంటారని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొందరు పరిస్థితిని బట్టి, తమ అవసరాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, ఎంచుకున్న లక్ష్యాన్ని బట్టి మారుతుంటారు. చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేస్తుంటారు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తులే శ్రీకాంత్ మాల్డే, చార్మి మాల్డే దంపతులు. ఐటీ ఉద్యోగాలను వదిలి.. ఆవుల్ని పెంచుతూ ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. వారి సక్సెస్ జర్నీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి నడుము ఒడిదుడుకులు..
శ్రీకాంత్ మాల్డే కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అహ్మదాబాద్‌లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే పరిచయమైన చార్మి మాల్డేను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగులు. అలా చూస్తుండగానే పదేండ్లు గడిచిపోయాయి. ఆకర్షణీయమైన వేతనం. దేనికీ లోటు లేదు. కానీ ఏదో వెలితి. కారణం.. అప్పుడున్న పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరగడం, అది ఆరోగ్యంపై ప్రభావం చూపడం వారిని ఇబ్బందులకు గురిచేసింది. దీంతో కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఒత్తిడి నడుమ పనిచేస్తూ.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ.. లక్షలు సంపాదించేకంటే.. తక్కువ ఆదాయం వచ్చినా సరే.. ఒత్తిడి లేకుండా జీవించ గలిగితే చాలని డిసైడ్ అయ్యారు. అప్పుడే వారి మదిలో పల్లెటూరు, పశువుల పెంపకం, ఆనందమయమైన జీవితం గిర్రున తిరిగాయి.
నాలుగు ఆవులతో ప్రారంభించి..
అది 2014 సంవత్సరం శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. దీంతో అతని ఆలోచలో మరింత మార్పు వచ్చింది. డబ్బుకంటే ప్రశాతంగా, ఆరోగ్యంగా బతకడం మేలని భావించాడు. భార్యతో అదే విషయమై చర్చించాడు. ఇంకేముంది ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. సరికొత్త ఆనందమయ జీవితాన్ని నిర్మించుకోవాలకున్న వారు. సహజ సిద్ధమైన సాధారణ జీవన శైలితో ముందుకు సాగాలని నిర్ణయించుకుని. అందుకోసం నాలుగు ఆవుల్ని కొని అహ్మదాబాద్‌లోని ఒక విశాలమైన ప్రాంగణంలో నివాసం ఏర్పర్చుకున్నారు. వాటిని పెంచుతూ.. పాలు, నెయ్యి, పనీర్ వంటివి అమ్ముతూ కాలం వెళ్లదీశారు. క్రమంగా ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మల్చుకోవాలన్న ఆలోచన పుట్టింది. ఇంకేముంది ఆవుల సంఖ్యను పెంచారు. ‘గౌనీతి ఆర్గానిక్’ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. పాలు, నెయ్యి, పనీర్‌లతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటివద్దనే అమ్మడం ప్రారంభించారు.
రూ. 2 కోట్ల టర్నోవర్..
2014లో 4 ఆవుల పోషణతో ప్రారంభమైన శ్రీకాంత్ మాల్డే, చార్మి మాల్డే దంపతుల జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆవుల సంఖ్య పెరిగింది. పాలు, నెయ్యి, పనీర్ వంటి ఉత్పత్తులు సైతం పెరిగాయి. దీనికి తోడు వారు కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, నిజాయితీగా వ్యవహరించడం, సాదా సీదా జీవితాన్ని గడపడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాలు, నెయ్యి, పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. రోజు రోజుకీ వారి వ్యాపారానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి రూ. 2 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఉన్న ఊరిలో స్వయం ఉపాధిని నమ్ముకుని, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా, ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆదాయాన్ని సైతం పొందుతున్న ఈ దంపతుల జీవనశైలి ఎంతోమందికి ఒక స్ఫూర్తిని, ప్రేరణను అందిస్తోంది. కొత్తగా ఆలోచించడం, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, ఆ దిశగా ప్రయత్నించడం చేస్తే.. ఎవరైనా, ఎక్కడైనా సక్సెస్ సాధించవచ్చు అంటున్నారు శ్రీకాంత్, చార్మి దంపతులు. Link






