అటవీ వాతావరణంలో సమయం గడిపితే దూరమవుతున్న అనారోగ్యాలు..! కారణమిదే..

by Javid Pasha |   (  Updated:2026-01-17 07:28:34  IST  )

అటవీ ప్రాంతంలో టైమ్ స్పెండ్ చేసేవారిలో లేదా అక్కడ నివసించేవారి శరీరంలో నేచురల్ కిల్లర్ సెల్స్ సహజంగానే పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు.

అటవీ వాతావరణంలో సమయం గడిపితే దూరమవుతున్న అనారోగ్యాలు..! కారణమిదే..
X

దిశ, ఫీచర్స్ : పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికంటే.. అటవీ ప్రాంతాల్లో లేదా అటవీ వాతావరనంలో నివసించేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, వీరికి అనారోగ్యాలు వచ్చే చాన్స్ చాలా తక్కువని తైవాన్‌లోని జిటౌ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఒక పైలట్ అధ్యయనం వెల్లడించింది. స్టడీలో భాగంగా పరిశోధకులు 11 మంది మధ్య వయస్సుగల వాలంటీర్లను 5 రోజులపాటు అటవీ ప్రాంతంలో (తైవాన్‌లోని జిటౌ అడవి) నివాసించాలని సూచించారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి హెల్త్ డేటాతో వీరి హెల్త్ డేటాను పరిశీలించారు. పలు రకాల మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. అటవీ ప్రాంతంలో గడిపినవారి శరీరంలో నేచురల్ కిల్లర్స్ (NK) సెల్స్ యాక్టివిటీ బాగా పెరిగింది.

అటవీ ప్రాంతంలో గడిపిన గ్రూప్‌లో నేచురల్ కిల్లర్ సెల్స్ శాతం19.5% ఉండగా, నగర ప్రాంతంలో గడిపిన వాలంటీర్ల గ్రూపులో 16.4% మాత్రమే ఉన్నట్లు ఈ పరిశోధకులు నిర్ధారించారు. అంటే ఫారెస్ట్ ఏరియాలో లేదా ఫారెస్టులో ఉండేవారిలో నేచురల్ కిల్లర్స్ (NK) సెల్స్ సహజంగానే పెరుగుతాయి. కాబట్టి ఇవి వివిధ రోగాల నుంచి, అనారోగ్యాల నుంచి రక్షించడంలో, జీవన ప్రమాణాలను పెంచడంలో సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా పురుషులు, అధిక బాడీ మాస్ ఇండెక్స్(BMI)ఉన్నవారు, హైపర్‌టెన్షన్ లేనివారు, స్మోకింగ్ చేయనివారు, టీ తాగేవారు వంటి ఉపసమూహా(subgroups)ల్లోనూ ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. అటవీ ప్రయాణం ముగిసి నగరాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభావం నాలుగు రోజుల వరకు కొనసాగింది.

ఫారెస్టు ఏరియాలో స్పెండ్ చేయడంవల్ల లేదా నివసించడంలో వల్ల ఆరోగ్యంగా ఉండటానికి మరొక ప్రధాన కారణం చెట్ల నుంచి వెలువడే ఫైటాన్‌సైడ్స్ అనే సహజ యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు. α-పినీన్, లిమోనీన్ వంటి ఫైటాన్‌సైడ్స్‌ను శ్వాసించడం వల్ల నేచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేషన్ పెరుగుతుంది. ఇవి శరీరంలో పెర్ఫారిన్, గ్రాన్‌జైమ్ A/B, గ్రాన్యులిసిన్ వంటి యాంటీ-క్యాన్సర్ ప్రోటీన్ల స్థాయిలను కూడా పెంచుతాయి. అంతేకాకుండా అటవీ పరిసరాల్లో ఉండటం వల్ల అడ్రినలిన్, నార్‌అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి, మొత్తం రోగ నిరోధకత మెరుగవుతుంది. ఇది రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.

Read More..

పెళ్లయ్యాక మీరు మారిపోయారు..! ఇలా ఎందుకు అంటారో తెలుసా?

Next Story