- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లయ్యాక మీరు మారిపోయారు..! ఇలా ఎందుకు అంటారో తెలుసా?
పెళ్లి తర్వాత మహిళల్లో భావోద్వేగ స్థిరత్వం పెరిగి, ఆందోళన, కోపం స్థాయిలు తగ్గుతాయి.

దిశ, ఫీచర్స్ : పెళ్లి అయిన కొత్తలో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే.. మీ స్నేహితులో, బంధువులో, సహచరులో తరచుగా ‘పెళ్లి అయ్యాక చాలా మారిపోయావ్.. మునుపటిలా లేవు’ అంటుంటారు. ఏదో మాట వరుసకు కాదు. ఇది నిజంగానే జరుగుతుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. మ్యారేజ్ కేవలం ఒక లీగల్ స్టేటస్ మాత్రమే కాదు. అది భావోద్వేగ, అలాగే వ్యక్తిత్వ మార్పులకు కారణం అవుతుందని లావర్నర్, కార్నీ, బ్రాడ్బరీ(Lavner, J. A., Karney, B. R., & Bradbury)అనే సైకాలజిస్టులు 2018లో 169 మంది కొత్తగా వివాహమైన దంపతులపై 18 నెలలపాటు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలు ‘Developmental Psychology’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. దీని ప్రకారం.. వివాహం తర్వాత మొదటి రెండు సంవత్సరాల్లో దంపతుల వ్యక్తిత్వ లక్షణాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులా ఇలా.. స్త్రీలు ఇలా..
పెళ్లి తర్వాత వ్యక్తుల్లో జరిగే మార్పులు వయస్సు, ముందుగా కలిసి జీవించడం(living together first) లేదా పిల్లలు కలిగి ఉండటం వంటి అంశాలతో సంబంధం లేకుండా.. సార్వత్రికంగా (Universally) కనిపిస్తాయి. పెళ్లి అయ్యాక పురుషులు సాధారణంగా మరింత బాధ్యతా యుతంగా (conscientious), నమ్మదగినవారిగా మారుతారు. ఇక మహిళల విషయానికి వస్తే భావోద్వేగ స్థిరత్వం(Emotional stability) పెరిగి, ఆందోళన(Anxiety), కోపం(anger) స్థాయిలు తగ్గుతాయి. అయితే దంపతులిద్దరిలోనూ ‘‘Openness’’ అంటే కొత్త అనుభవాల పట్ల ఆసక్తి, ‘Extroversion’ అంటే సామాజిక విషయాలపట్ల తగ్గుదల కనిపిస్తుంది. ఇంతకు ముందులా స్నేహితులతో, పరిచయస్తులతో మాట్లాడేందుకు ఆసక్తి చూపరు. దంపతులు తమ కుటుంబ లేదా ఇంటి దిన చర్యలలో స్థిరపడటం వల్ల ఇలా సామాజిక వర్గాలపై తక్కువ దృష్టి పెడతారు. ఇతర విషయాలకంటే పార్టనర్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తారు.
ఆకర్షణ తగ్గినా.. అర్థం చేసుకుంటారు
అదే విధంగా పెళ్లి కాకముందు ఉండే అట్రాక్షన్, ప్రేమ, ఆకర్షణీయమైన ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికల్లో అట్రాక్షన్ (కోర్ట్‌షిప్ మాస్క్) కాస్త తగ్గుతాయి. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు తక్కువ ఓపిక(less patience) మరింత అసహనంతో (disagreeable) మారుతారు. ఈ మార్పులు ఎక్కువగా అనివార్యమైనవి కాబట్టి.. పలు విషయాల్లో లాంగ్ టెర్మ్ సక్సెస్ అనేది కేవలం దంపతుల మధ్య పోలిక లేదా మ్యాచింగ్‌పై డిపెండ్ అవదు. బదులుగా ఎవరికి వారు స్వీయ నియంత్రణ (self-control)ను అభివృద్ధి చేసుకోవడం, అనేక విషయాల్లో పరస్పరం అర్థం చేసుకోవడం క్షమాపణ (forgiveness) అలవాటు చేసుకోవడం ద్వారా ఈ విధమైన మార్పులను మేనేజ్ చేయడానికి అలవాటు పడతారు. ఇది దంపతుల మధ్య సంబంధాన్ని బలపర్చడంతోపాటు వివాహ జీవితంలో మానసిక పరివర్తనను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అధ్యయనం పేర్కొన్నది.






