- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోలో ఫిమేల్ ట్రావెల్ బూమ్.. యువతుల్లో ఆత్మ విశ్వాసానికి నిదర్శనమా?
భారతీయ సోలో ఫిమేల్ ట్రావెలర్లలో 22 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతులు ఎక్కువగా ఉంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒంటరి ప్రయాణాలు చేసేవారిలో ఒకప్పుడు పురుషులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇటీవల మహిళల్లోనూ ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. ముఖ్యంగా భారత దేశంలోనూ ఇది పెరుగుతోందని జోస్టెల్ (Zostel) నివేదిక పేర్కొన్నది. అందమైన పర్యాటక ప్రాంతాలను ఒంటరిగా చుట్టి వచ్చేందుకు ఆధునిక యువతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. నివేదిక ప్రకారం.. 2025లో 92,192 సోలో ఫిమేల్ ట్రావెల్ బుకింగ్స్ రికార్డ్ అయ్యాయి. 2018లోని సంఖ్య కంటే దాదాపు ఇది మూడు రెట్లు ఎక్కువ. అంటే భారతీయ మహిళలు స్వతంత్రంగా, అనుభవాలపై ఆధారపడిన ప్రయాణాలపై మొగ్గు చూపడం పెరుతున్నట్లు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ వయసు వారే ఎక్కువ..
మరో విషయం ఏమిటంటే భారత దేశంలోని సోలో ఫిమేల్ ట్రావెలర్లలో చాలామంది 22 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతులు ఎక్కువగా ఉంటున్నారు. మహిళలు సొంతంగా తాము కోరుకున్న పర్యాటక ప్రపంచాన్ని అన్వేషించడంలో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది ఒంటరి ప్రయాణాలను రిపీట్ కూడా చేస్తున్నారు. దీంతో ఫిమేల్ సోలో ట్రావెలింగ్ ఇప్పుడు నిరంతర అనుభవంగా మారుతోంది. ఇది మహిళల్లో స్వేచ్ఛ, అడ్వెంచర్ అండ్ సెల్ఫ్ - డిస్కవరీకి సంబంధించిన కొత్త ఆసక్తులకు, అవకాశాలకు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు. ఫిమేల్ సోలో ట్రావెలింగ్ డెస్టినేషన్లలో గోవా, జైపూర్, గోకర్ణ, ముంబై, లోనావాలా వంటివి టాప్‌లో ఉంటున్నాయి. అలాగే ఆఫ్-బీట్ ప్రదేశాలైన షిల్లాంగ్, వార్కల(Varkala), వయనాడ్‌లు కూడా ఒంటరి మహిళా ప్రయాణికులకు ఆకర్షణీయ ప్రదేశాలుగా నిలుస్తున్నాయి.
కారణాలు - ఉపయోగాలు
ఇక సోలో ఫిమేల్ ట్రావెలర్స్ గతంకంటే కూడా ఎందుకు పెరుగుతున్నారంటే.. భారతీయ మహిళల్లో ఒకప్పటితో పోలిస్తే ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరగడం, రిమోట్ వర్క్ అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్‌స్టైల్, సోషల్ మీడియా ద్వారా ఇన్‌స్పిరేషన్, పర్యాటక ప్రాంతాల్లో భ్రదత, సురక్షితమైన హాస్టల్స్, అలాగే కమ్యూనిటీ- డ్రివెన్ ట్రావెల్ ఆప్షన్లు, మారుతున్న సామాజిక దృక్పథాలు వంటివి మహిళలు ఒంటరిగా ప్రయాణించేందుకు కారణం అవుతున్నాయి. అంతేకాకుండా సోలో ట్రావెలింగ్ వల్ల మహిళల్లో స్వేచ్ఛ, ఆత్మ విశ్వాసం, పర్సనల్ గ్రోత్, స్ట్రెస్ రిలీఫ్ అండ్ సెల్ఫ్-కేర్ వంటివి పెరుగుతున్నాయి. సొంత ఆసక్తులు, ఇష్టాలు, కల్చర్, నేచర్ వంటి అనుభవాలకు కేంద్రంగా ఉండటంవల్ల సోలో ట్రావెలింగ్ ఆనందాన్నిస్తున్నది. ఇది మహిళలను ఎంపవర్ చేసి, జీవితంలో కొత్త దృక్పథాలను నింపుతున్నది.






