- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖగోళ కల.. నాసా లెవల్ స్పేస్ టెక్.!
ఇది యువత నడిపే సైంటిఫిక్ మూవ్‌మెంట్‌గా మారింది

దిశ, ఫీచర్స్: చిన్నప్పుడు ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాల మధ్య తేలియాడాలని ఊహించుకుంటాం. మనమూ అంతరిక్ష యాత్రికులమైపోవాలి అనుకుంటాం. కానీ పెద్దయ్యాక చదువులు, ఉద్యోగాలు, సంసార బాధ్యతలు మీదపడి ఆ కలల్ని మర్చిపోతాం. ఐతే.. ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు పట్టువదలకుండా ప్రయత్నించి తమ కలను సాకారం చేసుకుంటున్నారు.
సైంటిఫిక్ మూమెంట్..
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన స్నేహదీప్ కుమార్ చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ చూస్తూ అంతరిక్ష రహస్యాలు తెలుసుకున్నాడు. సైంటిస్ట్ కావాలని కలగన్నాడు. ప్రతి ప్రాజెక్ట్‌లోనూ స్పేస్, శాటిలైట్ల గురించే ఆలోచించేవాడు. తొమ్మిదో తరగతిలో ఒక సైన్స్ ఎగ్జిబిషన్‌కు కాలీఫ్లవర్ విత్తనాలతో గ్రౌండ్‌వాటర్ రీప్లెనిష్‌మెంట్ మోడల్ చేశాడు. తర్వాత 'అరోరా అకాడమీ జర్నల్'ను రూపుదిద్దాడు. డిస్కార్డ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టీనేజర్ల టీమ్‌ను సమీకరించి యువ రీసెర్చర్లకు ప్లాట్‌ఫామ్ సృష్టించాడు. దీనికి 15 దేశాల నుంచి 40 మంది సభ్యులు ఉన్నారు. ఇది యువత నడిపే సైంటిఫిక్ మూవ్‌మెంట్‌గా మారింది.
నెబ్యులా స్పేస్ ఆర్గనైజేషన్..
స్పేస్ రీసెర్చ్, ఎక్విప్‌మెంట్ ఖరీదు ఎక్కువగా ఉండటం గమనించిన స్నేహదీప్ ఒక స్క్రూ కూడా రూ.4 కోట్లు పడుతుందని తెలుసుకున్నాడు. స్పేస్‌కు సంబంధించిన ఏదైనా చేసి అందరికీ అందుబాటులోకి తేవాలి అనేది మాత్రం తన మనసులో ఉండేది. కాలేజీలో చేరిన తర్వాత అక్కడ మోహిత్‌ను కలిశాడు. ఇద్దరూ అనుకోకుండా వాష్‌రూమ్‌లో మొదటిసారి కలుసుకొని తమ ఉద్దేశాలు తెలుసుకున్నారు. స్పేస్ పట్ల ఇద్దరికీ ఉన్న ఆసక్తితో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించారు. అలా అక్టోబర్ 2021లో 'నెబ్యులా స్పేస్ ఆర్గనైజేషన్' ప్రారంభమైంది.
తక్కువ ఖర్చుతో..
'క్యూబ్‌సాట్' ద్వారా చిన్న రీసెర్చ్ శాటిలైట్లపై దృష్టి పెట్టారు. ఇవి గామా రేడియేషన్‌ను గుర్తించేవి. గామా కిరణాలు బ్లాక్ హోల్స్, కాస్మిక్ ఎక్స్‌ప్లోషన్లను అర్థం చేసుకుంటాయి. భారత్‌లో ఇలాంటి క్యూబ్‌సాట్ లేదు. ఇవి చిన్నవే అయినా సమర్థవంతమైనవి. దీనికోసం స్పేస్ వెండర్ల నుంచి భాగాలు కొనకుండా స్థానిక మెటీరియల్స్ ఉపయోగించారు. అల్యూమినియం 7075 స్పేస్ సప్లయర్ దగ్గర 1,80,000 డాలర్లు. కానీ భువనేశ్వర్ లోకల్ షాప్‌లో రూ.700కే దొరుకుతుంది. సీఎన్‌సీ మెషీన్లతో మెటల్ కట్ చేసి ఖర్చు తగ్గించారు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఆపరేట్ చేస్తారు.
ఫస్ట్ స్టూడెంట్ బిల్ట్ గామా..
రెండేళ్ల రీసెర్చ్ తర్వాత ప్రోటోటైప్ పేపర్‌పై సిద్ధమైంది. అది 2024 మిలన్‌లోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో అంగీకరించబడింది. ఫండింగ్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నారు. గామా రేస్ డిటెక్ట్ చేస్తే ప్లానెటరీ ఇమేజింగ్ క్యూబ్‌సాట్‌లు, ఇంటర్‌ప్లానెటరీ మిషన్లకు విస్తరిస్తారు. ఇస్రో నుంచి మెంటార్లు దొరికితే తమ ప్రయోగం మరింత సులభం అవుతుంది. ప్రోటోటైప్ టెస్టింగ్‌తో భారత్‌లో మొదటి స్టూడెంట్-బిల్ట్ గామా-రే క్యూబ్‌సాట్‌గా క్యూబ్‌సాట్ సిద్ధమవుతోంది. ఇది నక్షత్రాలకు చేరడం మాత్రమే కాదు, ఇతరులు కూడా చేరేలా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంది.






