- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కుల్లోని వ్యర్థాలతో వెలిగే దీపాలు..! నెదర్లాండ్స్ నిపుణుల సరికొత్త ఆవిష్కరణ
పార్కుల్లో చిన్న చిన్న భూగర్భ బయోగ్యాస్ డోమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాలను కాంతి శక్తిగా మార్చే సాంకేతికతను నిపుణులు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నగరాల్లో వ్యర్థాల నిర్వహణ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు నెదర్లాండ్స్ బయో టెక్నాలజీ నిపుణులు. పార్కుల్లో చిన్న చిన్న భూగర్భ బయోగ్యాస్ డోమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాలను కాంతి శక్తిగా మార్చే సాంకేతికతను డెవలప్ చేశారు. దీంతో పార్కుల్లో, వీధుల్లో ప్రత్యేకంగా వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోవడంవల్ల ఖర్చు ఆదా అవుతోందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం!
సాధారణంగా పబ్లిక్ పార్కుల్లో గ్రాస్ కటింగ్, చెట్ల ఆకులు రాలడం వంటి కారణాలతో చెత్తా చెదారం పేరుకుపోతుంది. అలాగే పెట్ డాగ్స్‌ను వాకింగ్‌కు తీసుకురావడం వల్ల వాటి విసర్జిత వ్యర్థాలు సైతం ఇక్కడ పేరుకుపోతుంటాయి. కాగా వాటిని ప్రతిరోజూ క్లీన్ చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తుంటారు. అయితే నెదర్లాండ్స్‌లో మాత్రం వీటిని ఎక్కడికీ తరలించకుండా పార్కుల్లోనే ఏర్పాటు చేసిన బయో గ్యాస్ డోమ్స్‌లో వేయడం ద్వారా అవి కుళ్లిపోయి మీథేన్ వాయువును విడుదల చేస్తాయి. దీనిని ఉపయోగించుకొని సాంకేతిక నిపుణులు విద్యుచ్ఛక్తిగా, కాంతి శక్తిగా మారుస్తున్నారు. ఫలితంగా పార్కుల్లోని, పరిసర ప్రాంతాల్లోని వీధిలైట్ల నిర్వహణ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే కొనసాగుతోంది. అయితే కేవలం పార్కుల్లోని వ్యర్థాలే కాకుండా స్థానిక కెఫేల నుంచి కూడా వ్యర్థాలను తీసుకు వచ్చి బయోగ్యాస్ డోమ్స్‌లో వేయవచ్చు. Link






