- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోరు తెరిచి నిద్రపోతున్నారా? వామ్మో ఎంత డేంజరో తెలుసా?
నోరు తెరిచి నిద్రించడంవల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి, నోరు పొడిబారిపోతుంది. ఆమ్లత్వం పెరిగి దంతాలపై ఎనామెల్ కరిగిపోతుంది.

దిశ; ఫీచర్స్ : మీకు నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి శ్వాస తీసుకునే అలవాటు ఉందా? అయితే వెంటనే మానుకోండి. ఎందుకంటే మౌత్ బ్రీతింగ్ వల్ల దంతక్షయం రిస్క్ పెరుగుతుందని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగోకు చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ డెంటిస్ట్రీ నిర్వహించిన అధ్యయనం పేర్కొన్నది. ఇలా నోరు తెరిచి నిద్రించడంవల్ల నోటిలోని లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి, నోరు పొడిబారిపోతుందని తెలిపింది. దీనివల్ల లాలాజలం తగ్గడం వల్ల ఆమ్లత్వం పెరిగి దంతాలపై ఎనామెల్ (Enamel) కరిగిపోతుందని, కావిటీస్ ఏర్పడే అవకాశం పెరుగుతుందని పేర్కొన్నది. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.
బ్యాక్టీరియాలు పెరిగి..
అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. నోరు తెరిచి నిద్రపోవడంవల్ల మౌత్ pH స్థాయి సగటున 6.6కి తగ్గినట్లు (సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఇది 7.0 ఉంటుంది) పరిశోధకులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో pH స్థాయి 3.6 వరకు కూడా పడిపోయింది. ఇలాంటి ఆమ్ల వాతావరణం ఎనామెల్ డీమినరలైజేషన్‌కు దారితీస్తుంది. లాలాజలం లోపంవల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది, ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ (Streptococcus mutans) వంటి ఆమ్లం ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు ఎక్కువవుతాయి. దీంతో ప్లాక్ పేరుకుపోయి దంతాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏం చేయాలి?
నోటి ద్వారా శ్వాసవల్ల గమ్ ఇన్‌ఫ్లమేషన్(Gingivitis) వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనంలో తేలింది. కాబట్టి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలని, అది నోటిని తేమగా ఉంచడం ద్వారా దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉన్నవారు దంతవైద్యులను సంప్రదించడం ద్వారా తగిన సూచనలు, సలహాలు పాటించాలి. నోరు తెరిచి నిద్రపోయే అలవాటును మార్చుకోవాలి. అలాగే రాత్రి సమయంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన బ్రషింగ్, ఫ్లాసింగ్ (flossing), తగినంత నీరు తాగడం వంటి లాలాజలం ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవాలి. లేకపోతే దంతాలు దెబ్బతిని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






