- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రాత్రులు ఆ విధంగా గడిపితే.. 4 గంటల్లో నాలుగేండ్ల యవ్వనాన్ని కోల్పోయినట్లే..!
రెండే రెండు రాత్రులు మీ సమయాన్ని ఆ విధంగా గడిపితే.. ఒక్కసారిగా మీ శరీరం వయసు నాలుగేండ్లు పెరిగిపోతుంది. యవ్వనమంతా రెండు రోజుల్లో నీరుగారిపోతుంది.

దిశ, ఫీచర్స్ : వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ చేదు నిజమిది. మీరు ఎంత ఆరోగ్యంగా, యవ్వనంగా ఉన్నా సరే.. రెండే రెండు రాత్రులు మీ సమయాన్ని ఆ విధంగా గడిపితే.. ఒక్కసారిగా మీ శరీరం వయసు నాలుగేండ్లు పెరిగిపోతుంది. యవ్వనమంతా రెండు రోజుల్లో నీరుగారిపోతుంది. శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుంది. ఇంతకీ ఏ విధంగా గడిపితే అనే కదా మీ డౌట్.. మరేం లేదు. రెండు రాత్రులు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయే పరిస్థితిని అనుభవించిన వ్యక్తులు తమ నిజమైన వయస్సుకంటే నాలుగేండ్లు పెద్దవారిగా కనిపిస్తారని స్వీడన్‌లోని సైకాలజిస్ట్‌లు నిర్వహించిన రీసెంట్ అధ్యయనంలో వెల్లడైంది.
స్లీప్ సైకిల్ (sleep cycle) మానవుల ఆరోగ్యాన్ని, వయస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రత్యేకించి కొందరు వలంటీర్లను ఎంపిక చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సగటున వరుసగా రెండు రాత్రులు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయి, మిగతా సమయంలో సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడ్డవారు, 7 నుంచి 8 గంటలు చక్కగా నిద్రపోయే వారితో పోలిస్తే.. తమ సాధారణ వయస్సుకంటే నాలుగేండ్ల పెద్ద వయస్సు వారిలా కనిపించారని, శరీరంలో వృద్ధాప్య లక్షణాలు వృద్ధి చెందాయని కనుగొన్నారు. నిద్రలేమి అతి ఆలోచనలు, మానసిక ఆందోళన, అధిక అలసటకు దారితీయడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు. కాబట్టి నాణ్యమైన నిద్రలో యవ్వన రహస్యం దాగుందనేది తెలుసుకోవాలని, స్థిరమైన, నాణ్యమైన సరిపడా నిద్ర వ్యక్తి నిజమైన వయస్సుకంటే కూడా తక్కువ వయస్సు గల వారీగా కనిపించేలా చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అదే పేలవమైన నిద్ర అతి త్వరగా వృద్ధ్యాప్య లక్షణాలకు దగ్గర చేస్తుందని స్పష్టం చేశారు. Link






