Sleep Divorce: వేర్వేరు పడకలు.. భార్యభర్తల మధ్య కొత్త ట్రెండ్‌.. నిద్ర విడాకుల గురించి తెలుసుకోండి!

by Vennela |

Sleep Divorce: మీరు స్లీప్‌ డివోర్స్‌ (sleep divorce )గురంచి విన్నారా? ఇప్పుడిదే ట్రెండ్‌ అట. స్లీప్‌ డివోర్స్‌ అంటే నిద్ర విడాకులు అని తెలుగులో అర్థం.

Sleep Divorce: వేర్వేరు పడకలు.. భార్యభర్తల మధ్య కొత్త ట్రెండ్‌.. నిద్ర విడాకుల గురించి తెలుసుకోండి!
X

Sleep Divorce: మీరు స్లీప్‌ డివోర్స్‌ (sleep divorce )గురంచి విన్నారా? ఇప్పుడిదే ట్రెండ్‌(Trend) అట. స్లీప్‌ డివోర్స్‌ (sleep divorce )అంటే నిద్ర విడాకులు అని తెలుగులో అర్థం. ఇదేం విడాకాలుబ్బా అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా భార్య భర్తపై అలిగినా, భర్త భార్యపై అలిగినా వేర్వేరు గదుల్లో నిద్రపోతారు. ఒకే చోట నిద్రపోరు. అంటే అలిగితేనో, లేదా గొడవ పడితేనో వేర్వేరుగా నిద్రిస్తారనేది చాలా మంది గమనించే సీన్. అయితే స్లీప్ డివోర్స్‌(sleep divorce ) కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యేవాళ్లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. తమ రిలేషన్‌షిప్‌(Relationship)ను కాపాడుకోవడం కోసం జంటలు వేర్వేరుగా నిద్రిస్తున్నారట. బ్రిటన్‌(Briten)లో చాలా మంది ఇలానే చేస్తున్నారు. ఇటు ఇండియా(India)లోనూ కొందరు ఇదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఎందుకిలా చేస్తున్నారు?

గురకతోనే అసలు సమస్య:

నిజానికి ఈ ట్రెండ్ దంపతుల(Couple) మధ్య బాగా పాపులర్‌ అవుతోంది. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక(Snoring), దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ ఫోన్‌ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని పాటిస్తున్నారు. దీని కారణంగా ఇద్దరూ బాగా నిద్రపోయ్యే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం. గురకపెట్టే వ్యక్తికి కాళ్ల నొప్పులొస్తుంటాయి.

కొంతమంది నిద్రలో నడుస్తుంటారు. ఎక్కువగా బాత్‌రూమ్‌కు వెళ్తుంటారు. కదులుతుంటారు. అటు నుంచి ఇటు తిరుగుతుంటారు. ఇది పార్ట్‌నెర్‌కు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక ఓ వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే వారి రోగనిరోధక శక్తి(Immunity)తో పాటు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. అంతేకాదు...తొందరగా కోపం వస్తుంది. సహనంతో ఉండలేరు. ఓ రకమైన డిప్రెషన్(Depression) బారిన కూడా పడతారు. బాగా విశ్రాంతి లేని దంపతులు ఎక్కువ వాదులాడుకోవడం, చికాకుతో ఉండడం లాంటివి ఎక్కువగా చేస్తారు. ఇదంతా ఓ వెర్షన్. ఇంకో వెర్షన్ వేరేలా ఉంది.

ఇది అసలు కరెక్టేనా?

ఇలా వేర్వేరు గదుల్లో నిద్రపోవడం వల్ల కొన్ని జంటల్లో సాన్నిహిత్యం పోతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జాబ్‌ చేసి బాగా అలిసిపోయే వారు భాగస్వామి(Partner)తో కలిసి నిద్రపోయే క్షణాలు చాలా అమూల్యమైనవిగా చెబుతున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా కలిసి నిద్రపోయే వారు, వారు ఒకే దగ్గర పడుకున్నప్పుడు మాత్రమే నిద్రలోని దశలను పూర్తిగా అనుభవించగలుగుతారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇక రోజంతా పనిచేసేవారిలో ఎక్కువమంది తమకు భాగస్వామితో అనుబంధం పెరిగేది నిద్రపోయే సమయంలోనే అని భావిస్తారని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఉందని అంటున్నారు. ఇద్దరూ కలిసి కొంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చట. ఒక్క మాటలో చెప్పాలంటే స్లీప్ డివోర్స్ అనేది జంటలందరికీ ఉపయోగపడదు. నిజానికి జంటలే కాదు ఎవరైనా కలిసి నిద్రించడం వల్ల ఓ బాండ్‌ ఏర్పడుతుంది.

మనుషుల్లో ఇది పురాతన కాలం నుంచి ఉంది. మీరు చూస్కుంటే తల్లీ-బిడ్డల అనుబంధా(Mother-child bonding)న్ని ఒకసారి గమనించండి. మదర్ పాలిచ్చే సమయంలో తల్లీబిడ్డల మధ్య స్ట్రంగ్‌ అనుబంధం క్రియేట్ అవుతుంది. అలాగే వాళ్లిద్దరూ ఒకే సమయంలో నిద్రించడం ద్వారా ఇద్దరికీ విశ్రాంతి కలుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే స్లీప్ డివోర్స్‌ అన్నది మ్యూచువల్‌ అండర్‌స్టాండింగ్‌(Mutual understanding) మీదే జరగాలని నిపుణులు చెబుతున్నారు.

Next Story