Viral : నిద్రపోటీలు.. గురకపెడితే లక్ష రూపాయల బహుమతి!

by Javid Pasha |

ప్రపంచంలోనే నిద్రపోటీలు నిర్వహించే ఏకైక దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనేవాళ్లు జనంతో నిండిపోయిన షాపింగ్ మాల్స్‌ మధ్యలో కుర్చీలు వేసుకొని 20 నిమిషాలు నిద్రపోవాలి.

Viral : నిద్రపోటీలు.. గురకపెడితే లక్ష రూపాయల బహుమతి!
X

దిశ, ఫీచర్స్ : మనిషికి నిద్ర చాలా ముఖ్యం. సహజ సిద్ధమైన జీవన చక్రంలో అదొక భాగం. అయితే అతినిద్ర, మరీ తక్కువ నిద్ర మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే నాణ్యమైన నిద్ర ముఖ్యమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే స్పెయిన్‌లో మాత్రం నిద్ర ప్రాముఖ్యతను ప్రజలకు, ప్రపంచానికి తెలియజేయడానికి ప్రతీ సంవత్సరం నేషనల్ సియెస్టా ఛాంపియన్షిప్ (National Siesta Championship) పేరుతో నిద్రపోటీలు నిర్వహిస్తారు. జనం అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్ మధ్యలో అత్యంత ఉత్సాహ భరింతంగా జరుగుతాయి. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాటి గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

నిద్ర విజేతకు బహుమతి

ప్రపంచంలోనే నిద్రపోటీలు నిర్వహించే ఏకైక దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనేవాళ్లు జనంతో నిండిపోయిన షాపింగ్ మాల్స్‌ మధ్యలో కుర్చీలు వేసుకొని 20 నిమిషాలు నిద్రపోవాలి. ఎవరు అతి త్వరగా నిద్రలోకి జారుకుంటారు? ఎవరు ఎక్కువసేపు గాఢంగా నిద్రలో ఉంటారు. ఎవరు బిగ్గరగా గురక పెడతారు అనే విషయాలను పరిశీలించి పోటీలకు హాజరైన జడ్జిలు స్కోరు ఇస్తారు! అంతేకాకుండా విజేతకు సుమారు ₹90,000 (€1,000) నగదు బహుమతి, ట్రోఫీ, ఇంకా “స్పెయిన్‌లో అత్యంత బాగా నిద్రపోయే వ్యక్తి” అనే టైటిల్ ఇచ్చి సత్కరిస్తారు.

ఇదీ..అసలు ఉద్దేశం

నిద్ర పోటీల సంప్రదాయం స్పెయిన్‌‌లో 2010 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లోని ఓ పెద్ద షాపింగ్ మాల్‌లో ప్రతి సంవత్సరం వీటిని ఘనంగా నిర్వహిస్తారు. కాగా పోటీలో పాల్గొనే వారి గురకను కొలవడానికి డెసిబెల్ మీటర్, నిద్ర నాణ్యత కొలవడానికి హార్ట్ రేట్ మానిటర్లు ఉపయోగిస్తారు. గతంలో ఒక విజేత 85 డెసిబెల్స్ గురక పెట్టి రికార్డు సృష్టించాడు. ఈవెంట్‌కు వేలాది మంది ప్రేక్షకులు వస్తుంటారు. అయితే ఈ నిద్రపోటీలు కేవలం ఫన్ కోసం మాత్రమే కాదు. స్పెయిన్‌లోని సాంప్రదాయ “సియెస్టా” (Afternoon nap) సంస్కృతిని కాపాడటం, శాస్త్రీయంగా నిరూపితమైన నిద్ర ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు గుర్తు చేయడం వాటి ముఖ్య ఉద్దేశ్యం. ఈ పోటీ వల్ల చాలా మంది “20 నిమిషాల మధ్యాహ్న నిద్ర మనసుకు, గుండెకు, జ్ఞాపకశక్తికి ఎంత మంచిదో” తెలుసుకుంటున్నారని అక్కడి నిపుణులు చెబుతున్నారు. స్పెయిన్ ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ “నిద్ర ఒక ఆరోగ్య హక్కు” అని ప్రచారం చేస్తోంది. కాబట్టి ఇది ఒక ఆట మాత్రమే కాదు. స్పానిష్ సంస్కృతి, ఆరోగ్య అవగాహన కోసం జరిగే సరదాతో కూడిన ఒక పండుగ! Link

Next Story