Brain Health : ప్రతి రోజూ 2 గంటలు నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించండి.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!

by Javid Pasha |

Brain Health : ప్రతి రోజూ 2 గంటలు నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించండి.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!

Brain Health : ప్రతి రోజూ 2 గంటలు నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించండి.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ పనిచేయాలన్నా దానిపట్ల ఆసక్తి, అభిరుచి మాత్రమే ఉంటే సరిపోదు. మెదుడు కూడా చురుగ్గా పనిచేయాలి. అధిక పని ఒత్తిడి, అనారోగ్యాలు ఇలా రకరకాల కారణాలతో అప్పుడప్పుడు మన శరీరంతోపాటు బ్రెయిన్ కూడా అలసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సహజంగానే యాక్టివ్‌నెస్‌ను కోల్పోతుంటాం. అయితే మళ్లీ రీయాక్టివేట్ అవ్వాలంటే తగినంత రెస్ట్ అవసరం అంటుంటారు నిపుణులు. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని కూడా వెల్లడించింది. ఏంటంటే.. ప్రతిరోజూ 2 గంటలు నిశ్శబ్దంగా కూర్చోవడంవల్ల మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని, దీంతో మరింత ఉత్సాహంగా ఉండగలుగుతామని పేర్కొన్నది.

అధ్యయనంలో భాగంగా డ్యూక్ యూనివర్సిటీకి చెందిన రీ ప్రొడక్టివ్ బయాలజిస్ట్(Reproductive biologist ) ఇమ్కే కిర్స్ట్(Imke Kirste) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తొలుత ఎలుకలపై పరిశోధనలు నిర్వహించింది. వివిధ శబ్దాలు, మోజార్డ్ మ్యూజిక్ (Auditory stimuli—Mozart's music), రణగొణ ధ్వనులు, సాధారణ నిశ్శబద్దం, ప్రతిరోజూ 2 గంటల నిశ్శబ్దం(2 hours of silence every day) వంటివి వాటిని ప్రభావితం చేసిన తీరును పరీక్షించింది. కాగా రోజుకు 2 గంటల నిశ్శబ్దం ఎలుకల మెదడులోని హిప్పోకాంపస్ ఏరియాలో కొత్త న్యూరాన్‌ల ఉత్పత్తిని పెంచిందని కనుగొన్నారు. ఆ తర్వాత కొంతమంది మనుషులకు సంబంధించిన డేటాను కూడా విశ్లేషించారు. ఫైనల్లీ 2 గంటల నిశ్శబ్దం ఎలుకల్లో అయినా, మనుషుల్లో అయినా ఒక రకమైన సానుకూల ఒత్తిడి(eustress)కి కారణమై మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

రెండు గంటల నిశ్శబ్దం అనేది బ్రెయిన్ సెల్స్‌ యాక్టివిటీని పెంచడం ద్వారా మెదడు ప్రాంతంలోని హిప్పోకాంపస్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మెదడుకు విశ్రాంతి తీసుకోవడంలో, సమాచారాన్ని పునర్వ్యవస్థీకరించడంలో అవకాశం కల్పించడంతోపాటు జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. కార్టిసాల్‌ను తగ్గించడం ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను(Problem solving skills), భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించేవారు ఆనందంగా, ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతారని పరిశోధకులు అంటున్నారు.

Next Story