పరగడుపున పాలు తాగితే ప్రమాదమా?

by Disha Web Desk 22 |
పరగడుపున పాలు తాగితే ప్రమాదమా?
X

దిశ, ఫీచర్స్ : అసాధారణమైన పోషక లక్షణాలు ఉన్నందున పాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలను తాగవచ్చా? అనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. పాలను ఏ సమయంలో తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

చాలా మంది తమ రోజును పాలతో ప్రారంభిస్తారు. క్రమంగా వారికి ఇదొక అలవాటుగా మారుతుంది. ఇది రోజువారీగా కచ్చితమైన ప్రారంభాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పలువురు నిపుణులు మాత్రం ఈ అలవాటుపై విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. నిజానికి ఒక గ్లాస్ పాలు, తృణధాన్యాలతో రోజును ప్రారంభిస్తే హెవీ మీల్స్ చేసినట్లే అవుతుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం.. ఉదయాన్నే తేలికపాటి ఆహారంతో రోజును ప్రారంభించాలని భావిస్తే పాలు తీసుకోకపోవడమే మంచిది. అంతేకాదు ఖాళీ కడుపుతో పాలు తాగితే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఇది శరీర ఇన్సులిన్ స్థాయిని పెంచడమే కాక క్లియర్ స్కిన్‌కు ప్రయోజనకరంగా ఉండదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీర్ణవ్యవస్థపై పనిభారం మోపడం మంచిది కాదు. హెవీ మీల్స్‌ను జీర్ణం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఇక ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, ఉబ్బరం, కడుపులో తిమ్మిరి, వాంతులు సంభవించవచ్చు.

పాలు తాగేందుకు ఏది ఉత్తమ సమయం?

ఆయుర్వేదం ప్రకారం.. పాలు త్రాగడానికి ఉత్తమ సమయం సాయంత్రం. ఎందుకంటే పాలు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో కూడా సాయపడతాయి. ఇక ఉదయం పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని కొందరి నమ్మకం. కాబట్టి సాయంత్రం తాగడం వల్ల నిద్ర, నరాల విశ్రాంతికి తోడ్పడుతుంది.



Next Story

Most Viewed