Sheybarah Island : స్వర్గమంటే ఇదే కావచ్చు భయ్యా..! సౌదీ అరేబియాలోని ఈ ప్రాంతం చూశారా ?

by Javid Pasha |

Sheybarah Island : స్వర్గమంటే ఇదే కావచ్చు భయ్యా..! సౌదీ అరేబియాలోని ఈ ప్రాంతం చూశారా ?

Sheybarah Island : స్వర్గమంటే ఇదే కావచ్చు భయ్యా..! సౌదీ అరేబియాలోని ఈ ప్రాంతం చూశారా ?
X

దిశ, ఫీచర్స్

అక్కడ కాసేపు ఉన్నా చాలు.. అలసట, ఆందోళన అన్నీ దూరమౌతాయ్..

అక్కడ కాసేపు సేదదీరితే చాలు.. ఒత్తిడి రహిత అద్భుత ప్రపంచం కళ్లకు కడుతుంది.

అక్కడ కాసేపు గడిపినా చాలు.. ఆనందంతో మనసు ఉప్పొంగుతుంది.

అదే సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం(Red Sea)లో గల షెబారా ద్వీపం లేదా రిసార్ట్.

దాని గురించి తెలిసిన వారెవరైనా ‘స్వర్గమంటే ఇదే భయ్యా’ అంటుంటారు!

అవును.. ప్రపంచమంతా ఇప్పుడు 2025లో ఉంటే.. సౌదీ అరేబియా మాత్రం ఆర్కిటెక్చర్ పరంగా అద్భుతాలు క్రియేట్ చేస్తూ.. 3000 సంత్సరంలో ఉందంటారు ఔత్సాహికులు. ఆ దేశంలోని షెబారా ద్వీపంలో గల షెబారా రిసార్టే (Sheybarah Resort) ఇందుకు నిదర్శనమని చెబుతుంటారు. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం మధ్యలో అద్భుతమైన వాతావరణంలో నీటిపై తేలియాడుతున్న స్వర్గంలా ఉంటుంది. 2024లో నుంచి పర్యాటకులకోసం అందుబాటులోకి తెచ్చిన ఈ రిసార్టులో 73 ఎకో ఫ్రెండ్లీ విల్లాలు ఉన్నాయి. ఇందులోని 38 విల్లాలు అద్భుతమైన కిల్లా డిజైనింగ్(Killa Design) శైలిని తలపిస్తాయి.

షెబారా రిసార్టులో వంటా వార్పు, వెలుతురు ఎలా అనే సందేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. ఇక తాగునీటికోసం సముద్రంలోని ఉప్పునీటినే డీసాలినేషన్ ప్రాసెస్ (Desalination process)ద్వారా మంచినీటిగా మారుస్తారు. వ్యర్థాలను సైతం రీసైక్లింగ్ చేసే అత్యాధునిక వ్యవస్థ అందులో ఉంది. రిసార్ట్‌‌కు ఉపయోగించిన ఆర్కిటెక్చర్ మొత్తం కూడా పర్యావరణ హితమైనదే. అందుకే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే ప్రపంచ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయ స్థలంగా మారింది. ఈ రిసార్టుకు బోట్ లేదా సీ ప్లేన్ (Sea plane) ద్వారా మాత్రమే చేరుకునే అవకాశం ఉంది.

Next Story