- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sex For Rent : ఇంటి అద్దె కట్టలేరా..? అయితే మాతో సె**క్స్ చేయండి.. తెరపైకి ఇంటి ఓనర్స్ కొత్త అగ్రిమెంట్
‘సెక్స్ ఫర్ రెంట్’.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్. లండన్, టొరంటో, సిడ్నీ, డబ్లిన్ వంటి నగరాల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండగా.. యజమానులు డబ్బులకు ఇల్లు అద్దెకు ఇచ్చే బదులుగా లైంగిక సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు,

దిశ, వెబ్ డెస్క్ : ‘సెక్స్ ఫర్ రెంట్’.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్. లండన్, టొరంటో, సిడ్నీ, డబ్లిన్ వంటి నగరాల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండగా.. యజమానులు డబ్బులకు ఇల్లు అద్దెకు ఇచ్చే బదులుగా లైంగిక సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు, అమ్మాయిలు, తక్కువ జీతం గల ఉద్యోగులు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులను లక్ష్యంగా చేసుకుని ఈ లైంగిక దోపిడీ జరుగుతుంది. గ్లోబల్ హౌసింగ్ క్రైసిస్, రెంట్ పెరుగుదల, పేదరికం వంటి సమస్యలు ఈ సెక్స్ ఫర్ రెంట్ కల్చర్‌తో సంబంధం కలిగి ఉంది.
నిజానికి డైరెక్ట్‌గా సెక్స్ ఫర్ రెంట్ అని ఆఫర్ ఇవ్వరు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, కోలివింగ్, పేయింగ్ గెస్ట్ అనే పేర్లను ఉపయోగిస్తూ సంప్రదింపులు జరుగుతాయి. ఆ తర్వాత సెక్స్, ఫొటోలు డిమాండ్ చేస్తారు. ఈ మధ్య కెనడాలో CBC మార్కెట్‌ప్లేస్ ఇన్వెస్టిగేషన్ విద్యార్థులు, యువతులను లక్ష్యంగా చేసుకున్న ఇలాంటి ప్రకటనల గురించి వాస్తవాలను బయటపెట్టింది. వీటిలో సగం స్పష్టంగా లైంగిక సాన్నిహిత్యం గురించి అడగ్గా.. మిగిలినవి ఇండైరెక్ట్‌గా తమ ఉద్దేశాన్ని వెల్లడించాయి.
యూకేలో నాలుగు శాతం మంది మహిళలు ఈ అగ్రిమెంట్ ఒప్పందాలను ఎదుర్కొంటుండగా.. తక్కువ ఆదాయం గల వారిలో పది శాతంకు చేరింది. ఇక ఇంగ్లాండ్‌లో ఎనిమిది శాతం మహిళలు, ఐర్లాండ్‌లో 20 మందిలో ఒక అంతర్జాతీయ విద్యార్థి ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వలసదారులు, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ వ్యక్తులు ఈ అనుభవాలు చవిచూస్తున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.






