అది లేకుంటే యువతకు మైండ్ పనిచేయదు..! కారణం ఇదే..

by Javid Pasha |   (  Updated:2026-05-16 10:42:12  IST  )

యువతలో అత్యధికమంది లవ్ , డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి పర్సనల్ విషయాలను చర్చించడానికి స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమైపోతున్నారు.

అది లేకుంటే యువతకు మైండ్ పనిచేయదు..! కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : చేతిలో ఫోన్ లేకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు అంటుంటారు కొందరు. కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు అంటున్నాయి పలు అధ్యయనాలు. ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్ సహా వివిధ గాడ్జెట్స్ జీవితంలో భాగమైపోయాయి. అంతెందుకు ఒక్కగంట స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకుంటే.. తమకు మైండ్ పనిచేయదని, ఏమీ తోచదని అభిప్రాయపడే వారిలో జెన్‌జీలు ఎక్కువమంది ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ సహా పలు ఇతర ఎలక్ర్టానిక్ డివైజ్‌లలో ఏదోఒకటి ఉపయోగించకుండా నేటి యువత, పెద్దలు ఉండకలేకపోతున్నారు.

కమ్యూనికేషన్‌లో కీ రోల్

ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అంతా స్మార్ట్ టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా మాట్లాడటానికి, సోషల్ మీడియాను స్క్రోల్ చేయడానికి, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అలాగే స్టడీలో, ఉద్యోగంలో అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌పైనే చాలామంది ఆధారపడుతున్నారు. మరో విధంగా ఇన్వెస్టిగేషన్లలో, ఆధునిక పరిశోధనలలో కూడా ఇవి యూజ్ అవుతున్నాయి. అదే క్రమంలో చాలామంది వాటికి అడిక్ట్ అవుతున్నారు. రాత్రింబవళ్లు స్ర్కోల్ చేస్తుండటం ఒక వ్యసనంగా మారుతోంది.

వ్యసనం కూడా..

స్మార్ట్‌ఫోన్ల వినియోగం కొందరికి మేలు చేస్తుంటే.. మరికొందరు వాటిని దుర్వినియోగం చేయడంవల్లో, అతిగా ఉపయోగించడంవల్లో వ్యసనానికి కూడా దారితీస్తున్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరిలో స్మార్ట్ ఫోన్‌కు అతిగా అడిక్ట్ అవుతున్నారు. నిపుణుల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లలో గడిపే వ్యవధి గంటలలో పోల్చినప్పుడు 39% పెరిగింది. ఒక స్మార్ట్‌ఫోన్ కలిగిన వ్యక్తి రోజుకు 150 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నాడు. ఒక కార్టూన్ చానెల్ నిర్వహించిన సర్వే ప్రకారం కూడా.. 95% మంది యువత మొబైల్ ఫోన్‌లలో తరచుగా నిమగ్నమైపోతున్నారు. 62 % మంది ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారు లేదా వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలను స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నారు.

పర్సనల్ కమ్యూనికేషన్..

89 % మంది యువత లవ్ , డేటింగ్, రిలేషన్‌షిప్, ఇంకా ఇతర పర్సనల్ విషయాలను చర్చించడానికి తమ స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమైపోతున్నారు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు 37% మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు. 33.3 % మంది వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కూడా మధ్య మధ్యలో నిద్రమేల్కొన్నప్పుడు తమ ఫోన్‌లను చెక్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే సమాజంలో స్మార్ట్ ఫోన్ లేదా స్క్రీన్ వ్యసనం పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు. కఠినమైన ‘డిజిటల్ డిటాక్స్’ నిబంధనలను పాటించడంవల్ల అడిక్షన్ నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు. ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ లేదాఎలక్ట్రానిక్ పరికరాలను అతిగా ఉపయోగించకుండా ఉండే పరిస్థితినే డిజిటల్ డిటాక్స్ అంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, భౌతికంగా సమాజంతో కనెక్ట్ అవడానికి, గాడ్జెట్స్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇది దోహదం చేస్తుంది.

Next Story