- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : అన్ని అకౌంట్లకూ ఓకే పాస్‌వర్డ్..! ఎంత డేంజరో తెలుసా?
ఒకే పాస్‌వర్డ్‌ను మల్టిపుల్ అకౌంట్లకు ఉపయోగించేవారి డేటాను యాక్సెస్ చేయడం హ్యాకర్లకు సులభం అవుతుంది!

దిశ, ఫీచర్స్ : మీరు ఒకే పాస్ వర్డ్‌ను మల్టిపుల్ అకౌంట్లకు ఉపయోగిస్తున్నారా? అయితే వెంటనే మార్చేసుకోండి అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే అలా ఉపయోగించడం సేఫ్ కాదంటున్నారు. నిజానికి వివిధ వెబ్‌సైట్లకు కూడా ఒకే పాస్‌వర్డ్ ఉపయోగించకూడదని చాలామందికి తెలుసు? కానీ ఎక్కువ పాస్‌వర్డ్స్ ఉంటే మర్చిపోతుంటామనే ఉద్దేశంతో ఐదారు అకౌంట్లకు ఒకటే సెట్ చేసేసుకొని వాడేస్తుంటారు. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం కూడా 70% కంటే ఎక్కువ మంది వ్యక్తులు మల్టిపుల్ లాగిన్‌లకు(For multiple logins) ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నారు. గుర్తుంచుకోవడంలో, ఉపయోగించడంలో ఇది సులభంగా అనిపించవచ్చు కానీ.. దీర్ఘకాలంలో సీరియస్ సెక్యూరిటీ రిస్క్‌లను తెచ్చి పెడుతుంది. అవేమిటో చూద్దాం పదండి!
*ఒకే పాస్‌వర్డ్‌ను మల్టిపుల్ వెబ్‌సైట్లకు, యాప్‌లకు, బ్యాంక్ అకౌంట్లకు ఉపయోగించేవారి డేటాను, వారికి సంబంధించిన మల్టిపుల్ అకౌంట్లను యాక్సెస్ చేయడం హ్యాకర్లకు సులభం అవుతుంది.
*ట్రస్టెడ్ సెక్యూరిటీ (TrustedSec) అనే ఎథికల్ హ్యాకింగ్ కంపెనీ అడ్వైజరీ సొల్యూషన్స్ నిపుణుల ప్రకారం.. ఒక వెబ్‌సైట్‌లో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు సేకరించగలిగితే, హ్యాకర్ ఆ డేటాను ఇతర సైట్‌లలోనూ ట్రై చేస్తాడు. ఎందుకంటే చాలా మంది ఒకే పాస్‌వర్డ్‌ను బ్యాంకింగ్, ఈమెయిల్, సోషల్ మీడియా, ఎయిర్‌లైన్ సైట్‌లలో కూడా ఉపయోగిస్తారు. అంటే ఒక సైట్ బ్రీచ్ అయితే.. హ్యాకర్లు ఆ డేటాను తీసుకొని ఇతర సైట్‌లలో ట్రై చేసి, ఎన్నో అకౌంట్‌లను హ్యాక్ చేస్తారు.
*కొందరు పాస్‌వర్డ్ మార్చినప్పుడు పాత పాస్‌వర్డ్ చివరి నంబర్‌కు ఏదో ఒకటి జోడించి కొత్తగా క్రియేట్ చేస్తుంటారు. ఇది కూడా అంత సేఫ్ కాదు. అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ న్యూ హేవెన్ సైబర్‌సెక్యూరిటీకి చెందిన నిపుణులు. పైగా ఇలాంటి పాస్‌వర్డ్‌లలో ప్రిడిక్టబుల్ ప్యాటర్న్‌లు ఉంటాయి. కాబట్టి హ్యాకర్లు ఆటోమేటెడ్ టూల్స్‌తో ఆ ప్యాటర్న్‌లను ఈజీగా గుర్తిస్తారు.
*మీ పాస్‌వర్డ్ లేదా అకౌంట్‌ను సురక్షితంగా ఉంచడానికి బెస్ట్ ఆప్షన్ మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) అంటున్నారు నిపుణులు. ఇది ఇది టెక్స్ట్ మెసేజ్, ఆథెంటికేటర్ యాప్, ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అడిషనల్ వెరిఫికేషన్ ఇస్తుంది. సెట్ చేసుకోవడం, ఉపయోగించడం కాస్త ఇబ్బందికరంగా అనిపించినా చాలా ఎఫెక్టివ్‌గా, సేఫ్‌గా ఉంటుంది.
*పాస్‌వర్డ్ మేనేజర్‌లు (NordPass, 1Password, RoboForm వంటివి) కూడా మీకు సహాయపడతాయి. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసి స్టోర్ చేస్తుంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. పాస్‌వర్డ్ మేనేజర్ బ్రీచ్ అవ్వడం చాలా రేర్. పాస్‌వర్డ్‌లు ఎలా క్రియేట్ చేయాలి? పాస్‌వర్డ్‌లు లాంగ్ (సుమారు 20 అక్షరాలు), అలాగే కాంప్లెక్స్‌గా ఉండాలి. సాంగ్ లిరిక్స్ లేదా ఫ్రేజ్‌లను ఉపయోగించి, వాటిని మార్చి సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఈ మెయిల్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన అకౌంట్‌లకు కచ్చితంగా యూనిక్ పాస్‌వర్డ్‌లు ఉపయోగించండి. తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా మీ పాస్‌వర్డ్స్ హ్యాక్ అయితే సైబర్ సెక్యూరిటీ నిపుణులను లేదా సాంకేతిక నిపుణులను సంప్రదించండి.
ఒకే పాస్ వర్డ్ ఉపయోగిస్తే జరిగే నష్టాలు
* ఒక సైట్ హ్యాక్ అయితే, హ్యాకర్లు మీ ఇతర అకౌంట్‌లను కూడా సులభంగా యాక్సెస్ చేయగలరు.
* బ్యాంకింగ్, ఈమెయిల్, సోషల్ మీడియా, ఎయిర్‌లైన్ అకౌంట్‌లు కూడా రిస్క్‌లో పడతాయి.
*పాస్‌వర్డ్‌ను కొద్దిగా మార్చడం (ఉదా: password123 → password124) కూడా అంత సేఫ్ కాదు. పూర్తిగా మార్చాలి
*ఒకే పాస్‌వర్డ్ లేదా కొద్దిగా మార్చిన పాస్ వర్డ్స్ ప్యాటర్న్‌లను ఆటోమేటిక్ టూల్స్‌తో హ్యాకర్లు సులభంగా గుర్తిస్తారు.
బెస్ట్ సొల్యూషన్ ?
*మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) ఆన్ చేయండి.
*టెక్ట్స్ మెసేజ్, ఆథెంటికేటర్ యాప్, ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీ ద్వారా అడిషనల్ సెక్యూరిటీ వస్తుంది.
*పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించండి (ఉదా: NordPass, 1Password, LastPass). ఇవి ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసి స్టోర్ చేస్తాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
పాస్‌వర్డ్‌లు ఎలా ఉంటే సేఫ్ ?
*దాని పొడవు కనీసం 15-20 అక్షరాల్లో ఉండాలి
*అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్ వంటి కాంప్లెక్స్ ఉపయోగించాలి
*ప్రతీ అకౌంట్‌కు వేర్వేరుగా పాస్ వర్డ్స్ ఉండాలి






