- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతున్నారా..? ఏం జరుగుతుందంటే..!
స్నూజ్ తర్వాత నిద్ర లేచినా మెదడు పూర్తిగా మెలకువలోకి రాదు. దీన్ని Sleep Fragmentation అంటారు. ఫలితంగా రోజంతా మత్తుగా, మూడీగా, గాఢ నిద్ర లాంటి ఫీలింగ్ ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం. చల్లని వెదర్ కారణంగా నిద్ర నుంచి త్వరగా మెలకువ రాదు. అందుకే చాలామంది అలారం పెట్టుకొని పడుకుంటుంటారు. అయితే కొందరు అలారం మోగినప్పుడల్లా ఇంకాసేపయ్యాక లేద్దామని స్నూజ్ బటన్ నొక్కుతుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని, అది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.
*నిజానికి అలారం మోగగానే మెలకువ వస్తుంది. ‘ఇక ఇప్పుడు నిద్ర లేవాలి అని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ మనం స్నూజ్ బటన్ నొక్కడంవల్ల మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇలా ప్రతీసారి చేయడం వల్ల చిన్న చిన్న నిద్రలు (10–15 నిమిషాలు) చాలా డీప్ స్లీప్‌లోకి తీసుకెళ్తాయి. తర్వాత మళ్లీ అలారం మోగినప్పుడు లేవడం చాలా కష్టమవుతుంది. దీనినే నిపుణులు ‘Sleep Inertia’ అంటున్నారు. అంటే స్నూజ్ బటన్ మళ్లీ మళ్లీ నొక్కడం వల్ల నిద్ర- మేల్కొలుపునకు సంబంధించిన ఇంటర్నల్ క్లాక్ (సర్కాడియన్ రిథమ్) పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. గందరగోళానికి గురవుతుంది.
*సహజంగానే మానవ శరీరం రోజూ ఒకే సమయంలో లేవడానికి అలవాటు పడుతుంది. కానీ స్నూజ్ వల్ల 10–30 నిమిషాలు ఆలస్యం అయితే, మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్, అలాగే కార్టిసాల్ (మెలకువ హార్మోన్) బ్యాలెన్స్ తప్పుతాయి. ఫలితంగా మన బయోలాజికల్ క్లాక్ “ఇప్పుడు లేవాలా? ఇంకా నిద్రపోవాలా?” అని కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
*స్నూజ్ తర్వాత నిద్ర లేచినా మెదడు పూర్తిగా మెలకువలోకి రాదు. దీన్ని Sleep Fragmentation అంటారు. ఫలితంగా రోజంతా మత్తుగా, మూడీగా, గాఢ నిద్ర లాంటి ఫీలింగ్ ఉంటుంది. ఏకాగ్రత కోల్పోతుంటాం. ఇది దీర్ఘకాలిక అలసటకు, బద్ధకానికి దారితీస్తుంది. అస్థిరమైన నిద్ర కారణంగా సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ రిస్క్ పెరుగుతుంది.
*స్నూజ్ బటన్ ఎఫెక్ట్ కారణంగా ఆ రోజు ఉదయం గందరగోళంగా అనిపిస్తుంది. దీంతో వర్క్‌లో ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఆఫీస్‌లో ఫోకస్ చేయలేకపోవడం, చేస్తున్న పనిలో తప్పులు దొర్లడం జరుగుతాయి. కాబట్టి తరచుగా స్నూజ్ బటన్ నొక్కకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి నొక్కితే పర్లేదు. కానీ మళ్లీ మళ్లీ నొక్కడం సిర్కాడియన్ రిథమ్‌కు ఆటంకం కలిగించి అనారోగ్యాలకు కారణం అవుతుంది. కాబట్టి అలారం పెట్టిన సమయానికే నిద్రలేవడం బెటర్.






