- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trends: 2026 యూత్ రెజల్యూషన్: ఆత్మ పరిశీలనే సక్సెస్ మార్గం!
సెల్ఫ్ అక్సెప్టెన్సీ లేదా ఆత్మ పరిశీలన అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితివైపు నడిపించే వంతెన లాంటిది. మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా, లోపాలను అంగీకరించకుండా సరిద్దుకోవడం కాదు.

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా?.. ప్రతీ సక్సెస్‌ఫుల్ వ్యక్తి సహజంగానే సెల్ఫ్ అక్సెప్టెన్సే(Self-Acceptance)ని కలిగి ఉంటారని నిపుణులు అంటున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత, ఆచరణలో పెట్టే ముందు వీరు ఆత్మపరిశీలన చేసుకుంటారు. తప్పులను అంగీకరిస్తారు. లోపాలను సరిచేసుకుంటారు. తాము తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతారు. ఏ విషయంలోనూ తొందరపాటు ప్రదర్శించరు. ఇటువంటి ప్రవర్తనే వ్యక్తులను విజయ తీరాలకు చేరుస్తుందని, కొత్త సంవత్సరంలోనూ ఇలాంటివారు సక్సెస్ సాధించే చాన్సెస్ ఎక్కువుంటాయని పర్సనల్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ ట్రైనింగ్ నిపుణులు అంటున్నారు. సంబంధాల్లోనూ, వృత్తి జీవితాల్లోనూ సక్సెస్ మంత్ర బేసిక్ రూల్ ఇదేనని చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన సంబంధాలకు, వృత్తి నైపుణ్యాలకు, ఆనందకరమైన జీవితానికి అదే పునాది.
లోపాలు గుర్తించండి
నిజానికి ఆత్మపరిశీలన లేదా లోపాలను అంగీకరించడం అందరికీ అంత తేలిక కాకపోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులే కొన్నిసార్లు సంబంధాలను, వృత్తి జీవితాలను, జీవితంలో ఆనంద క్షణాలను ప్రభావితం చేస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా మారుస్తుందో అంచనా వేయగలగాలి. ఈ విధమైన స్పృహతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాస్తవాలు తెలుసుకుంటారు. ఆత్మ పరిశీలనకు(Self-Acceptance) లేదా అంగీకారానికి మీ మనసు మొగ్గు చూపుతుంది. దాదాపు 95% మంది తమలో తాము ఇష్టపడేవి, అలాగే తాము ఇష్టపడని లక్షణాలను గుర్తించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారని మానసిక నిపుణులు చెబుతుంటారు. కారణం ఆత్మ పరిశీలన లేదా లోపాలు అంగీకరించే అలవాటు లేకపోవడమే.
2026లో సెల్ఫ్ అక్సెప్టెన్స్..
సెల్ఫ్ అక్సెప్టెన్సీ లేదా ఆత్మ పరిశీలన అనేది మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితివైపు నడిపించే వంతెన లాంటిది. అందుకే మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా, మీ లోపాలను మీరు అంగీకరించకుండా, మిమ్మల్ని మీరు సరిద్దుకోవడం అస్సలు సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అందుకోసం చదువులో, వృత్తిలో, చేస్తున్న ఏ పనిలోనైనా కావచ్చు. మిమ్మల్ని నిరోధించేది ఏమిటి? మీకు ఆటంకం ఏది? మీరు దేనికి భయపడుతున్నారు? మీ ఓటమికి దారితీస్తున్న కారణాలేమిటి? అనేది ఒకసారి పరిశీలించుకోండి. అప్పుడు మీలో లోపాలు కనిపించవచ్చు. చేయాల్సిందల్లా వాటిని అంగీకరించి, ఆత్మ పరిశీలన చేసుకొని సరిదిద్దుకుంటూ అడుగు ముందుకు వేయడమే 2026లో మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అంటున్నారు నిపుణులు.
అనుమానాలు.. అంగీకారాలు
చాలామందిలో కనిపించే ఒక బ్యాడ్ హాబిట్ ఏంటంటే.. తమ లోపాలను, తమ తప్పులను అంగీకరించరు. పైగా ఇతరుల్లో వాటిని వెతుకుతుంటారు.ఈ విధమైన లక్షణాలు స్వీయ తప్పిదాలకు దారితీస్తాయి. బాధితులను మరిన్ని సమస్యల్లోకి నెడుతుంటాయి. కానీ వాస్తవాలను అంగీకరించేవారు ఆ సమస్యల్లో చిక్కుకోరు. కారణం.. తమను తాము మార్చుకుంటూ, మంచి దిశగా మలచుకుంటూ ముందుకు సాగుతుంటారు. లోపాలు లేదా తప్పులను అంగీకరించడమో, ఆత్మ పరిశీలన చేసుకోవడమో సమస్యలకు దారితీస్తుందనే అనుమానాలు కూడా కొందరిని వెంటాడుతుంటాయి. కానీ వాస్తవం కాదంటున్నారు నిపుణులు. సరైన సందర్భంలో మీ లోపాలను అంగీకరించకపోతే, వాటిని సరిదిద్దుకోకపోతే ఇంకెప్పుడూ అలాంటి అవకాశం రాకపోవచ్చు. యాక్సెప్టేషన్‌ను తిరస్కరించడంవల్ల సక్సెస్ దారులు మూసుకుపోతాయి. దీంతో మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిత్వంగల వ్యక్తులుగా, మంచి నైపుణ్యం గల ఎంప్లాయీస్‌గా, మంచి స్టూడెంట్‌గా, బెస్ట్ పర్సన్‌గా తీర్చిదిద్దుకోవడం కష్టమవుతుంది. అదే లోపాలను అంగీకరించి చూడండి.. మీరు అధగమించాల్సిన అవరోధాలేమిటో తెలిసొస్తాయి. వాటిని ఈజీగా దాటేయగలుగుతారు.
పరిస్థితులపై క్లారిటీ..
ఆత్మ పరిశీలన చేసుకోవడం అంటే.. అదేదో పొరపాటు చేసినట్లు భావించనవసరం లేదు. పొరపాట్లను సరిదిద్దుకునే మార్గమే సెల్ఫ్ అక్సెప్టెన్స్. దీనివల్ల మీ నియంత్రణలోని ప్రవర్తనా విధానాలను, లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా, మీ కంట్రోల్లో లేని విషయాలను ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసుకోగలుగుతారు. ఉదాహరణకు మీ కుటుంబ సభ్యుల ముందు, సన్నిహితులముందు మీ సమస్యను, లోపాన్ని చర్చించడమో, అంగీకరించడమో చేస్తే.. దాని నుంచి ఎలా బయటపడాలో తెలిసి రావచ్చు. అందుకు తగిన సూచనలు రావచ్చు. ఇదే స్వీయ అంగీకారంతో వచ్చే మార్పు. అప్పుడు ఇతరుల్లో మీకు ఏం కావాలో? లేదా మీరు కోరుకునే సంబంధాలు, పరిస్థితులు, నైపుణ్యాలు ఎలా ఉండాలో తెలుస్తుంది. మీపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. లోపాలను అధిగమించే విషయంలో క్లారిటీ వస్తుంది. అందుకే ‘‘మీరు వాస్తవాలను అంగీకరించండి. ఆత్మపరిశీలన చేసుకోండి. అదే 2026లోనూ మిమ్మల్ని సక్సెస్ తీరాలవైపు నడిపిస్తుంది’’ అంటున్నారు నిపుణులు.






