బ్లాక్-నేప్డ్ నెమలి..140 ఏళ్ల తర్వాత ఆచూకీ

by Dishanational4 |
బ్లాక్-నేప్డ్ నెమలి..140 ఏళ్ల తర్వాత ఆచూకీ
X

దిశ, ఫీచర్స్: దాదాపు 140 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న బ్లాక్-నేప్డ్ నెమలి తాజాగా న్యూ గినియాలోని ఫెర్గూసన్ ద్వీపంలో కనుగొనబడింది. కోడి పరిమాణం గల ఈ అరుదైన నెమలిని కనుగొనేందుకు ప్రతీరోజు శ్రమించిన శాస్త్రవేత్తలు.. రిమోట్ కెమెరా ట్రాప్‌ ద్వారా పక్షిని కనుగొన్నట్లు పేర్కొన్నారు. సుమారు శతాబ్దానికి పైగా అంతరించిపోయిన 20 పక్షి జాతుల్లో ఇదీ ఒకటి కాగా 1882లో మొదటిసారిగా వీటి గురించి తెలిసినప్పటికీ.. పరిశోధకులచే గుర్తించబడలేదన్నారు. అయితే ఈ జాతుల కోసం సుమారు ఒక నెల శోధించిన తర్వాత బ్లాక్-నేప్డ్ నెమలిని పట్టుకున్నట్లు చెప్పారు.

అయితే దీనిని చూడగానే చాలా ఆశ్చర్యం వేసిందని.. ఒక యునికార్నర్‌ని కనుగొన్నట్లు అనిపించిందని అమెరికన్ బర్డ్ కన్సర్వెన్సీలో లాస్ట్ బర్డ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్, జాన్ సి. మిట్టర్ మీర్ అన్నారు. ఈ అరుదైన నెమలిని కనుగొనడంతో పరిశోధకులు విజయం సాధించారు. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, రివైల్డ్ మరియు అమెరికన్ బర్డ్ కన్సర్వెన్స్ సహకార ప్రయత్నాల ఫలితంగా ఈ పరిశోధన కార్యక్రమం జరిగింది. కనీసం ఒక దశాబ్దం పాటు గుర్తించబడని, అంతరించిపోయినట్లు ప్రకటించబడని 150 కంటే ఎక్కువ పక్షి జాతులను తిరిగి కనుగొనడం ఈ పరిశోధన ముఖ్య లక్ష్యమని తెలిపారు. అయితే 2019లో పాపువా న్యూ గినియా సమీపంలోని ఫెర్గూసన్ ద్వీపంలో బ్లాక్-నేప్డ్ నెమలిని కనుగొనడంలో ఇదే విధమైన ప్రయత్నం విఫలమైందని పరిశోధకులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed