- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగి పడేసిన సిగరెట్ ముక్కలతో ఎకో ఫ్రెండ్లీ రోడ్ల నిర్మాణం.. వినూత్న పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు..
తాగి పడేసిన సిగరెట్ ముక్కలతో ఎకో ఫ్రెండ్లీ రోడ్ల నిర్మాణం.. వినూత్న పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు..

దిశ, ఫీచర్స్ : సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అయితే అలవాటు కొద్దీ చాలామంది తాగుతూనే ఉంటారు. దీనివల్ల తాగే వారికి, తాగకపోయినా ఆ పొగను పీల్చేవారికి నష్టం జరుగుతుంది. పర్యావరణాన్ని సైతం కలుషితం చేస్తాయి. ఎందుకంటే ఇవి సెల్యులోజ్ ఎసిటేట్‌తో తయారవుతాయి. నేలలో సహజంగా కుళ్లిపోవడానికి సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నేల, నీరు, గాలి కాలుష్యానికి కారణం అవుతాయి. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి సిగరెట్ ముక్కలను ఎకో ఫ్రెండ్లీ రోడ్ల నిర్మాణంలో వినియోగించే వినూత్న పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
స్పెయిన్‌లోని గ్రనడా, అలాగే ఇటలీలోలోని బోలోగ్నా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు తాగి పడేసిన సిగరెట్ బట్‌ల(Cigarette butts)ను రీసైకిల్ చేసి, బలమైన, పర్యావరణ అనుకూలమైన రోడ్లను నిర్మించే వినూత్న పద్ధతని కనుగొన్నారు. అందుకోసం వారు సిగరెట్ ఫిల్టర్లను చిన్న చిన్న గుళికలుగా మార్చి, పొడిచేసి, వాటిని ఆస్ఫాల్ట్‌తో కలిపే పద్ధతిని డెవలప్ చేశారు. కాగా ఈ మిశ్రమాన్ని రోడ్డు నిర్మాణాల్లో వాడటంవల్ల పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియ రోడ్డు బలాన్ని, స్థిరత్వాన్ని పెంచడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను నివారించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. LINK






