- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Covid - 9 : 25 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. సరికొత్త పరికరాన్ని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు
Covid - 19 : 25 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. సరికొత్త పరికరాన్ని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రపంచాన్నే వణికించిన అరుదైన వైరస్‌లలో కోవిడ్ - 19 ఒకటి. ఆ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, వైరస్ ధాటిని ఎదుర్కొనేలా ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం కారణంగా ప్రస్తుతం ఇది పెద్ద ప్రమాదకరం కాదు. కానీ సఫర్ అవకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఇప్పటి వరకు మాలిక్యులర్ (ఉదా., RT-PCR), అండ్ యాంటిజెన్ టెస్టులు అని రెండు ప్రధాన పరీక్షల ద్వారా కరోనా(Corona)ను నిర్ధారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు కోసం ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది. అందుకోసం సమయం పడుతుంది. కానీ అలాంటి అవసరం లేకుండా కేవలం 25 నిమిషాల్లోనూ కరోనా వైరస్ సహా పలు వ్యాధులను గుర్తించగల అధునాతన పరికరాన్ని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.
మాస్ జనరల్ బ్రిఘమ్ (Mass General Brigham)సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కొంతకాలంగా వివిధ వైరస్‌లను, వ్యాధులను త్వరగా గుర్తించగల టెక్నాలపీపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తాజాగా లుకాస్ (Luminescence CAscade-based Sensor-LUCAS) అని పిలువబడే పరికరాన్ని డెవలప్ చేశారు. దీనికి సంబంధించిన పరిశోధనా వివరాలు నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ జర్నల్(Nature Biomedical Engineering)లో ఇటీవలె పబ్లిష్ అయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఈ వైరస్ డిటెక్షన్ టూల్ (virus detection tool) కోవిడ్ - 19, హెచ్‌ఐవీ(HIV), హెపటైటిస్ వంటి వ్యాధులను కేవలం 25 నిమిషాలలో గుర్తించడంలో సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
లుకాస్ (LUCAS) డివైజ్ వాస్తవానికి రోగ నిర్ధారణ పరీక్షలో ఉపయోగించేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఎంజైమ్‌ను ఉపయోగిస్తుంది. దీంతో మినమినీలు కాంతిని(Miniminis emit light) విడుదల చేసే విధంగా శాంపిల్స్(samples) లేదా వస్తువులను ప్రకాశింపజేస్తుంది. అంటే ఈ ప్రకాశవంతమైన లైటింగ్ రక్తం లేదా నాసికా ననమూనాలలో(In nasal samples) హానికరమైన వైరస్‌లు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు డాక్టర్లకు సహాయపడుతుంది. దీంతో వేగవంతమైన, కచ్చితమైన రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది. అయితే ఈ టూల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిని మరింత మెరుగుపరచడానికి, మల్టిపుల్ ఇన్‌ఫెక్షన్లను ఒకేసారి గుర్తించే సామర్థ్యాన్ని పరీక్షించడంపై శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రావచ్చు.






