Medical Technology : గుండెకు ఢోకాలేదిక.. సర్జరీ తర్వాత రికవరీకోసం కొత్త సాంకేతికత!!

by Javid Pasha |   (  Updated:2026-01-06 06:13:15  IST  )

గుండె శస్త్రచికిత్స తర్వాత, రికవరీ సమయంలో హార్ట్ రిథమ్‌ను రెగ్యులేట్ చేయడానికి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అందించగల అతి చిన్న డివైజ్‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

Medical Technology : గుండెకు ఢోకాలేదిక.. సర్జరీ తర్వాత రికవరీకోసం కొత్త సాంకేతికత!!
X

దిశ, ఫీచర్స్ : గుండెకు రక్త సరఫరాలో ఆటంకాన్ని తొలగించేందుకు వైద్య నిపుణులు అత్యవ సరపరిస్థితుల్లో సర్జరీలు చేస్తుంటారు. రక్తనాళాల్లో క్లాట్‌ను తొలగిస్తారు. అయితే కేవలం సర్జరీ ఒక్కటే సక్సెస్ అయితే మాత్రాన సరిపోదు. ఆ తర్వాత రికవరీ కూడా ముఖ్యం. అందుకోసం వైద్య నిపుణులు శరీరంలోకి అతి చిన్న పేస్ మేకర్లు(pacemakers) ప్రవేశ పెట్టి, తర్వాత తీసివేస్తుంటారు. వీటికి వైర్లు, బ్యాటరీలు ఉంటాయి. ఏమాత్రం తప్పిదం జరిగినా ఇన్ఫెక్షన్ రిస్క్ పొంచి ఉంటుంది. కానీ భవిష్యత్తులో అలాంటి రిస్క్ ఉండకపోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు. జాన్ రోజర్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం బియ్యపు గింజంత సైజులో గల ఒక ఇంటజెక్టబుల్ డివైజ్‌ను డెవలప్ చేసింది. ఇది లైట్ (కాంతి) ద్వారా యాక్టివేట్ అవుతుంది. దీనిని సాధారణంగా ‘world’s smallest pacemaker’ లేదా ‘light-activated bioresorbable pacemaker’ లేదా ‘millimetre-scale bioresorbable optoelectronic pacemaker’ అని పిలుస్తారు.

శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన బియ్యపు గింజ సైజు గల పేస్ మేకర్(pacemaker) హార్ట్ సర్జరీ లేదా ఇంజ్యూరీ తర్వాత రికవరీ సమయంలో హార్ట్ రిథమ్‌ను రెగ్యులేట్ చేయడానికి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అందిస్తుంది. బయోకాంపటిబుల్ మెటీరియల్స్‌తో తయారైన డివైజ్ క్రిటికల్ హీలింగ్ పీరియడ్ తర్వాత సహజంగానే డిసాల్వ్ అవుతుంది. దీంతో పర్మినెంట్ హార్డ్‌వేర్ లేకుండానే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఇది వైర్‌లెస్‌గా కంట్రోల్ అవుతుంది. న్యూబార్న్ బేబీస్ వంటి పేషెంట్స్‌కు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సాంప్రదాయ పేస్‌మేకర్లకు భిన్నంగా శరీరంలోని న్యాచురల్ ప్రాసెస్‌లతో సమానంగా కరిగిపోతుంది. దీంతో ఇన్ఫెక్షన్స్ రిస్క్ తగ్గుతుంది. ఇది హార్ట్ రిపేర్ అవుతున్న సమయంలో మాత్రమే పనిచేసి, తర్వాత అవశేషాలు లేకుండా అదృశ్యం అవుతుంది. అయితే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ టెస్టింగ్‌లో ఉందని, మానవ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందుబాటులోకి వస్తే మాత్రం హార్ట్ పేషెంట్లలో ఇన్ఫెక్షన్ రిస్క్ లను వందశాతం నివారించడంలో సహాయపడుతుంది.

ప్రయోజనాలు :

* శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఫేస్ మేకర్ గుండె సర్జరీ లేదా గాయం తర్వాత రికవరీ సమయంలో గుండె రిథమ్‌ను సరిచేస్తుంది.

*దీని పని పూర్తయ్యాక శరీరంలోనే కరిగిపోతుంది. మళ్లీ సర్జరీ చేసి తీయాల్సిన అవసరం లేదు.

*సాధారణ పేస్‌మేకర్లు శాశ్వతంగా ఉంటాయి. కానీ ఇది టెంపరరీ (తాత్కాలికం) మాత్రమే.

*ఇది శరీరానికి హాని కలిగించని సురక్షితమైన మెటీరియల్స్‌తో తయారైంది. సహజంగా కరిగిపోతుంది.

*వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. బయట నుండి కాంతి లేదా సిగ్నల్‌తో కంట్రోల్ చేయవచ్చు.

*పేషెంట్‌కు ఇన్ఫెక్షన్ రిస్క్, సర్జరీ స్ట్రెస్ తగ్గుతుంది.

*ప్రత్యేకంగా శిశువులు లేదా తాత్కాలిక సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగం.

*ఇప్పుడు ఇది టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. జంతువులపై సక్సెస్ అయింది. త్వరలో మనుషులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు.

*భవిష్యత్తులో దీనిని విస్తృతంగా వాడితే గుండె చికిత్సల్లో ఇన్ఫెక్షన్ల రిస్కును తగ్గించవచ్చు. రికవరీ రేటును పెంచవచ్చు.


Read More..

మెడిసిన్ నుండి ఎనర్జీ వరకు.. భవిష్యత్తును మార్చనున్న నానో టెక్నాలజీ!

Next Story