- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
I CAN DO ..! మనిషిలా ఆలోచించే కంప్యూటర్‌ను క్రియేట్ చేసిన నిపుణులు
మానవ మెదడు కణాలను సిలికాన్ చిప్‌లతో సమన్వయం చేయడం ద్వారా మనిషిలా ఆలోచించగల కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు

దిశ, ఫీచర్స్ : కంప్యూటర్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే మనిషిలా ఆలోచిస్తూ, సమాచారం గ్రహిస్తూ పనిచేసే కంప్యూటర్ల గురించి మీరెప్పుడైనా విన్నారా? కార్టికల్ ల్యాబ్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు దీనిని డెవలప్ చేశారు. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అచ్చం మనిషిలా ఆలోచించగలిగే CL1 అనే బయోలాజికల్ కంప్యూటర్‌ను వారు ఆవిష్కరించారు.
పరిశోధకులు రూపొందించిన ‘సీఎల్ 1’ అనే జీవ కంప్యూటర్, మానవ మెదడు కణాలను సిలికాన్ చిప్‌లతో సమన్వయం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ వినూత్న టెక్నాలజీ సాంప్రదాయ ఏఐ (AI) కంటే వేగంగా నేర్చుకోవడం, మరింత సంమర్థవంతంగా సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, స్వతహాగా ఆలోచించి విశ్లేషించడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. 8 లక్షల న్యూరాన్‌లతో పాంగ్ గేమ్‌ను నేర్చుకున్న ప్రయోగాల ఆధారంగా, CL1 అనే కంప్యూటర్ ఒక షూ బాక్స్ పరిమాణంలో ఉండి, న్యూరాన్‌లను పోషించే పోషక ద్రవంతో నిండిన వాతావరణంలో పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఇది బయోలాజికల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ (biOS) ద్వారా మేనేజ్ చేయబడుతుంది. అంతేకాకుండా న్యూరాన్‌లతో కోడ్‌ను ఇంటరాక్ట్ చేసే సిమ్యులేటెడ్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.






