- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ కిటికీలుంటే కరెంట్, ఏసీ అక్కర్లేదు
దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ట్రాన్స్‌పరెంట్ సోలార్ విండో టెక్నాలజీని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

దిశ, ఫీచర్స్ డెస్క్: ఇంట్లో, ఆఫీసులో కరెంట్ పోగానే వెలుతురు కోసం కిటికీలు తీస్తుంటాం. మరి బయటినుంచి విపరీతమైన చలిగాలి, భారీ వర్షం, వేసవిలో వేడిగాలులు వీస్తుంటే ఒక్క కిటికీ కూడా ఓపెన్ చేసేందుకు ధైర్యం చేయలేం కదా. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు సైంటిస్టులు సరికొత్త విండో టెక్నాలజీని డెవలప్ చేశారు. కరెంట్ లేకపోయినా ఇళ్లంతా వెలుతురు ఉండేలా, వేసవిలో చల్లగాలికోసం కిటీకి తీయకపోయినా ఇళ్లు కూల్‌గా ఉండేలా దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ట్రాన్స్‌పరెంట్ సోలార్ విండో టెక్నాలజీని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
24 గంటలు వెలుతురు..
ఇళ్లపై నిర్మించే సోలార్ ప్లేట్లు ఇంటికి పవర్‌ను అందిస్తుండగా ఇకపై నేరుగా కిటికీల నుంచి కరెంట్ లైట్ల వలే కాంతి ప్రసరివంచేలా సోలార్ గ్లాసు(invisible solar panels)ను రూపొందించారు. ఇవి మధ్యాహ్నం సూర్యరశ్మినుంచి పవర్ సేవ్ చేసుకుని రాత్రిపూట వెలుతురును అందించనున్నాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా పవర్ జనరేట్ చేస్తాయని, ఈ కిటికీల రూపంలో 24 గంటలు ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వినూత్న ప్రయత్నం ద్వార చిన్న ఇళ్లతోపాటు పెద్ద పెద్ద భవనాల్లోనూ కిటికీల నుంచి లైట్లకు ప్రత్యామ్నాయంగా వెలుతురు అందించగలమని ‘కొరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీ యూనివర్సిటీ’కి చెందిన ప్రొఫెసర్ జున్ యోంగ్-సియోక్ పరిశోధనా బృందం తెలిపింది.
కిటికీలకు సెన్సార్ సిస్టమ్..
ఈ ట్రాన్సపరెంట్ సోలార్ విండో.. భవనాన్ని కాంతివంతంగా ఉంచడంతో పెద్దగా లైట్స్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సాధారణ కిటికీనుంచి వచ్చే హీట్, చలిని ఈ వీండో రాకుండా అడ్డుకుంటుంది. దీంతో ఏసీ, రూమ్ హీటర్ అవసరం తగ్గుతుంది. ఇంటిపై నిర్మించే సోలార్ ప్యానెల్‌కు ప్రత్యామ్నాయంగా ఇళ్ల కిటికీలు, గోడలు, పైకప్పుల వద్ద వీటిని సెట్ చేసుకోవచ్చు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫీసీ అనే కంపెనీ ఇప్పటికే యూరప్‌లోని అధికశాతం ఆఫీసు బిల్డింగుల్లో వీటిని ఇన్‌స్టాల్ చేసింది. ఈ కిటికీలకు కేవలం పవర్‌ను జనరేట్ చేసే సామర్థ్యమే కాకుండా సెన్సార్ సిస్టమ్ క్రియేట్ చేయొచ్చని సైటింస్టులు వెల్లడించారు.
ఎలా పనిచేస్తాయి..
ఈ సోలార్ గ్లాసులో ప్రత్యేకమైన సెమీకండక్టర్ మెటిరియల్స్ ఉంటాయి. ఇవి సూర్యరశ్మిలోని ఫోటాన్‌లను ఎలక్ట్రాన్‌లుగా మార్చి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. సోలార్ ప్యానెల్స్‌లాగే ఫోటోవోల్గాయిక్ (PV) టెక్నాలజీని వినియోగించి పవర్ జనరేట్ చేస్తాయి. ఇళ్లలోకి వచ్చే వేడిని కంట్రోల్ చేయడం వల్ల ఏపీ బిల్లు ఆదా అవుతుంది. ఇవి భవన నిర్మణంలో భాగమే కాబట్టి ప్రత్యేకంగా ప్లేస్ అవసరం లేదు. అలాగే కొరియాలోని ఇంచియాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొరియన్ శాస్త్రవేత్తలు మొబైల్ ఫోన్లలో అనుసంధానించగల సోలార్ ప్లేట్లను కూడా డెవలప్ చేస్తున్నారు. టైటానియం డయాక్సైడ్, నికెల్ ఆక్సైడ్ వంటి పదార్థాలను ఉపయోగించి మొబైల్‌కు చార్జింగ్ అందించేలా సోలార్ ప్లేట్లపై ప్రయోగాలు చేస్తున్నారు.






