అందుబాటులోకి ఆర్టిఫిషియల్ హార్ట్‌‌..! ఫ్రాన్స్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ

by Javid Pasha |   (  Updated:2026-02-17 07:54:04  IST  )

ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అధునాతన ఆర్టిఫిషియల్ హార్ట్‌ను ఒక విప్లవాత్మక పరికరంగా నిపుణులు పేర్కొంటున్నారు.

అందుబాటులోకి ఆర్టిఫిషియల్ హార్ట్‌‌..! ఫ్రాన్స్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : మనిషి ఆరోగ్యంగా జీవించి ఉండటానికి అవసరమయ్యే శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. అందుకే హార్ట్ జాగ్రత్త అంటుంటారు వైద్య నిపుణులు. అయితే ఒక్కసారి గుండె పోటు రాగానే ప్రాణంపోతుందనే పరిస్థితి నుంచి ఆధునిక ప్రపంచం బయటపడింది. హార్ట్ పనిచేయడం ఆగిపోయినప్పుడు మరో వ్యక్తి అంటే.. అవయవ దాత ద్వారా స్వీకరించిన గుండెను అమర్చడం ద్వారా చనిపోయే వ్యక్తిని బతికించే అవకాశం ప్రస్తుతం ఉంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఇకముందు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభించే చాన్స్ ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే.. ఫ్రాన్స్‌కు చెందిన కార్మాన్ (CARMAT) కంపెనీ మనిషి ప్రాణాలు నిలుపగలిగే అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ హార్ట్‌ను డెవలప్ చేసింది. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది!

ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అధునాతన ఆర్టిఫిషియల్ హార్ట్ ప్రపంచ వైద్య రంగం చరిత్రలోనే ఒక విప్లవాత్మక పరికరంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఇది మానవ గుండెను పూర్తిగా భర్తీ చేసేలా రూపొందించబడింది. డోనర్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. పైగా ఇందులో అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఉండటంవల్ల రోగి శారీరక కార్యకలాపాలకు అనుగుణంగా రక్త ప్రవాహాన్ని ఆటోమేటికల్లీ అడ్జస్ట్‌మెంట్ చేస్తుంది. అయితే దాతల నుంచి స్వీకరించిన గుండె మాదిరి ఇమ్యూన్ రిజెక్షన్(తిరస్కరణ) లేకపోవడం ఇందులో మరో ప్రధాన ప్రయోజనం అంటున్నారు నిపుణులు. ఈ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ డోనర్ల కొరతను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించబడింది.

క్లినికల్ ట్రయల్స్‌లో పాజిటివ్ రిజల్ట్స్

అధునాతన ఆర్టిఫిషియల్ హార్ట్‌వల్ల గుండె వైఫల్యం బాధితులు ఎక్కువకాలం వేచి ఉండం లేదా డెత్ రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉందని, డోనర్ల కోసం వేచి ఉండాల్సిన ట్రాన్స్‌ప్లాంట్ వెయిటింగ్ లిస్ట్‌లను నివారించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఫ్రాన్స్ శాస్త్రవేత్తల కృత్రిమ గుండెకు ఆశాజనక ఫలితాలు వచ్చాయి. కొంతమంది రోగులు నెలల నుంచి సంవత్సరాలపాటు బతికేలా చేసింది. అయితే ఇది ఇంకా క్లినికల్ ఎవాల్యుయేషన్ స్టేజ్‌లో‌నే ఉంది. లాంగ్‌టెర్మ్ సేఫ్టీ, మన్నిక(durability)పై పర్యవేక్షణ జరుగుతోందని దానిని డెవలప్ చేసిన కార్మాట్ బయోటెక్ కంపెనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. హార్ట్ ఫెయిల్యూర్స్ ఇక ప్రాణాంతకం కాకుండా ఆగిపోవడమే కాకుండా, మెరుగైన జీవన నాణ్యత సాధ్యం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇది హార్ట్ ఫెయ్యిలూర్ సందర్భాల్లో బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ లేదా లాంగ్ టెర్మ్ సపోర్ట్‌గా ఉపయోగపడుతుంది.

Next Story