వెదర్‌ను బట్టి రంగుమార్చుకునే ఆర్టిఫిషియల్ స్కిన్.. మరో సాంకేతిక ఆవిష్కరణ!

by Javid Pasha |

కాంతి, పీడనం, కదలిక, టెంపరేచర్ మార్పులకు అనుగుణంగా రంగులను మార్చుకునే ఆర్టిఫిషియల్ స్కిన్‌‌ను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

వెదర్‌ను బట్టి రంగుమార్చుకునే ఆర్టిఫిషియల్ స్కిన్.. మరో సాంకేతిక ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికతతో మరో అద్భుతాన్ని క్రియేట్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (University of Houston)కు చెందిన శాస్త్రవేత్తలు. ఆక్టోపస్, స్క్విడ్ వంటి సెఫలోపాడ్స్ వంటి స్కిన్ కలర్ మార్చుకోగలిగే సముద్ర జీవుల సామర్థ్యాన్ని అనుసరించి.. బయటి పరిస్థితులకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు ప్రతి స్పందనగా రంగు, నమూనాలను మార్చుకోగలిగే బయో-ఇన్‌స్పైర్డ్ స్కిన్ (artificial skin)ను అభివృద్ధి చేశారు.

సాంకేతిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ స్కిన్ సాంప్రదాయ సింథటిక్ చర్మంలా కాకుండా, ఈ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ కాంతి, పీడనం, కదలిక, స్ట్రెచింగ్ లేదా టెంపరేచర్ మార్పులకు అనుగుణంగా దాని రంగు, ప్యాటర్న్ మార్చుకుంటుంది. అంటే సాధారణ సింథటిక్ స్కిన్ స్థిరంగా ఉంటే.. ఇది డైనమిక్‌గా రియాక్ట్ అవుతుందని దానిని డెవలప్ చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ సాఫ్ట్ ఎలక్ట్రానిక్స్, నానో మెటీరియల్స్, లేయర్డ్ ఎలాస్టిక్ పాలిమర్లను కలిపి, సెఫలోపాడ్స్ చర్మంలోని క్రోమాటోఫోర్స్ (Pigment cells)ను అనుకరిస్తుంది.

ఆర్టిఫిషియల్ స్కిన్ మెటీరియల్ బెంట్ అయినప్పుడు లేదా ప్రెస్ చేసినప్పుడు మైక్రోస్కోపిక్ స్ట్రక్చరల్ మార్పులు లైట్ రిఫ్లెక్షన్‌ను మార్చి, వేగంగా విజువల్ షిఫ్ట్స్‌ను (రంగు మార్పులు) క్రియేట్ చేస్తాయి. ఇది ప్రీ-ప్రోగ్రామ్డ్ డిస్‌ప్లేలపై డిపెండ్ అవదు. నేచర్ మాదిరి ఆటోమేటికల్లీ రియాక్ట్ అవుతుంది. అయితే ఈ సాంకేతిక పరిణామం ఇంకా ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ, ఇది ప్రాస్థెటిక్ లింబ్స్.. అంటే కృత్రిమ అవయవాల్లో సహజమైన స్కిన్ టోన్‌లకు మ్యాచ్ అయ్యేలా, సాఫ్ట్ రోబోటిక్స్, వేరబుల్ టెక్నాలజీ, మెడికల్ మానిటరింగ్ పరికరాలు, అడాప్టివ్ క్యామోఫ్లేజ్ సిస్టమ్స్‌లో ఉపయోగపడుతుందని రీసెర్చర్స్ అంటున్నారు. అయితే ఇది బయోలాజికల్ టిష్యూ మాత్రం కాదు. కేవలం ఇంజినీర్డ్ మెటీరియల్ మాత్రమే. అయినప్పటికీ బయోలాజికల్ ఫంక్షన్స్‌ను అనుసరిస్తుంది.

Next Story