Health : క్యాన్సర్ నివారణలో ఇమ్యూనో థెరపీ.. వ్యాక్సిన్ల అభిృద్ధిపై శాస్త్రవేత్తల ఫోకస్!

by Javid Pasha |

ఇమ్యూనో థెరపీ అనేది అత్యాధునిక చికిత్సలో ఒక మెరుగైన పద్ధతి. రోగి శరీరంలోని సహజ రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి క్యాన్సర్క ణాలను గుర్తించి, నాశనం చేయడానికి సహాయపడుతుంది.

Health : క్యాన్సర్ నివారణలో ఇమ్యూనో థెరపీ.. వ్యాక్సిన్ల అభిృద్ధిపై శాస్త్రవేత్తల ఫోకస్!
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ నివారణలో భాగంగా శాస్త్రవేత్తలు మరింత వేగవంతమైన చికిత్సలు, వ్యాక్సిన్ల అభివృద్ధిపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ చికిత్సలైన కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలకంటే మెరుగైనదిగా భావించే ఇమ్యూనో థెరపీపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ ఎలియాస్ సయూర్ (Dr. Elias Sayour) టీమ్ యూనివర్సల్ యాక్టివేటర్ ఆధారిత mRNA వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, ఎర్లీ హ్యూమన్ ట్రయల్స్‌కు సన్నాహాలు చేస్తున్నది. అలాగే హార్వర్డ్ సహకారంతో BioNTech & Cancer Research Uk” వంటి సంస్థలు కూడా కొత్త వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

చికిత్సలో మెరుగైన పద్ధతి

ఇమ్యూనో థెరపీ అనేది అత్యాధునిక చికిత్సలో ఒక మెరుగైన పద్ధతి కాగా, ఇది రోగి శరీరంలోని సహజ రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి క్యాన్సర్ కణాలను గుర్తించి, నాశనం చేయడానికి సహాయపడుతుంది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి పాత పద్ధతులు క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేస్తే, ఇమ్యూనో థెరపీ అనేది శరీర రక్షణ వ్యవస్థను బలోపేం చేసి లేదా పునరుద్ధరించి క్యాన్సర్‌తో పోరాడేలా చేస్తుంది. ఇందులో భాగంగానే శాస్త్రవేత్తలు ఇప్పుడు యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు.

ఇమ్యూన్ సెల్స్‌కు శిక్షణ ఇస్తూ..

కొత్తగా అభివృద్ధి చేస్తున్న యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు శరీర సహజ రక్షణ వ్యవస్థను ఉపయోగించి, వివిధ రకాల క్యాన్సర్లలో సాధారణంగా కనిపించే ట్యూమర్ మార్కర్ల(Shared proteins or genetic sequences)ను గుర్తించేలా ఇమ్యూన్ సెల్స్‌కు శిక్షణ ఇస్తాయి. ఇది ఒకే అవయవం లేదా టిష్యూ మీద మాత్రమే పరిమితం కాకుండా, బ్రెస్ట్, లివర్, కొలన్ వంటి అనేక సాలిడ్ ట్యూమర్లపై విస్తృతంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలాంటి వ్యాక్సిన్లు పర్సనలైజ్డ్ నియోయాంటిజెన్‌లతోపాటు సాధారణ ట్యూమర్-సంబంధిత యాంటిజెన్లను టార్గెట్ చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఎలా పనిచేస్తాయి?

యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ల అభివృద్ధిలో లిపిడ్ నానోపార్టికల్స్ (LNPs) లేదా వైరల్ వెక్టర్లు వంటి అధునాతన డెలివరీ సిస్టమ్స్ కీ రోల్ పోషిస్తాయి. mRNA ఆధారిత వ్యాక్సిన్లలో LNPs mRNAను రక్షించి, ఇమ్యూన్ సెల్స్, ముఖ్యంగా డెండ్రిటిక్ సెల్స్‌కు సమర్థవంతంగా అందజేస్తాయి. ఇవి T-సెల్స్‌ను యాక్టివేట్ చేసి, ట్యూమర్ సెల్స్‌ను గుర్తించి నాశనం చేసేలా చేస్తాయి. ఇంకా ఈ చికిత్సలు లాంగ్ టర్మ్ ఇమ్యూన్ మెమరీలను ఏర్పరచడంపై దృష్టి సారిస్తాయి. తద్వారా చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతిని నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

క్లినికల్ ట్రయల్స్‌..

అభివృద్ధి చేస్తున్న వాటిలో Moderna&Merckకు సంబంధించిన mRNA-4157 వంటి వ్యాక్సిన్లు మెలనోమాలో రీకరెన్స్ రిస్క్‌ను సైతం తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వాటి వల్ల సేఫ్టీని, సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి పరీక్షలు జరుగుతున్నాయని, ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్లతో కలిపి ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి బహుళ రకాల క్యాన్సర్లపై పనిచేసే సొల్యూషన్లు భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సను మరింత పర్సనలైజ్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి ఆశాజనంగా ఉన్నాయని చెబుతున్నారు.

Next Story