- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : పర్యావరణ పర్యవేక్షణ కోసం ‘స్మార్ట్ డస్ట్’.. డేటా సేకరణలో కీ రోల్ !
స్మార్ట్ డస్ట్‌గా పేర్కొనే మైక్రో స్కోపిక్ సెన్సార్లు నిజానికి గాలిలో తేలియాడుతూ పర్యావరణ లేదా జీవసంబంధ డేటాను సేకరించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో, పర్యావరణంలో అనేక విషయాలను పసిగట్టగల టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వస్తోంది. వాతావరణ మార్పులను ముందుగానే తెలుసుకోవడం, ప్రమాదాలను ముందుస్తుగానే పసిగట్టడం దీనిద్వారా సాధ్యం అవుతోంది. అలాగే మానవులు వెళ్లలేని వివిధ ప్రదేశాల్లోని పరిస్థితిని తెలుసుకోవడానికి, అవసరమైన చోట నిఘా కోసం ప్రస్తుతం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వంటివి సహాయపడుతున్నాయి. కాగా వీటన్నింటికంటే అత్యంత అధునాతమైన సాంకేతికతకోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మైక్రోస్కోపిక్ సెన్సార్లతో కూడిన స్మార్ట్ డస్ట్‌ను సైంటిస్టులు తయారు చేశారు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఉపయోగాలేమిటి?
స్మార్ట్ డస్ట్ అనేది ఒక మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్(MEMS), అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది. నిజానికిది 0.02 క్యూబిక్ మిల్లీమీటర్ సైజ్ తో కూడిన మైక్రో సెన్సార్ల సమూహం. ఇది ఉష్ణోగ్రత, తేమ, శబ్దం, రసాయనాలు వంటి డేటాను వైర్‌లెస్‌గా సేకరించడంలో సహాయపడే అద్భుతమైన సాంకేతికత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో (Vital signs monitoring) రోగ నిర్ధారణలు, మైనింగ్ రంగంలో భద్రతా పర్యవేక్షణ, డిఫెన్స్‌లో సర్వైలెన్స్ కోసం, అలాగే పర్యావరణ మానిటరింగ్ కోసం ఉపయోగపడుతుంది.
ఎవరు డెవలప్ చేశారు?
మైక్రోస్కోపిక సెన్సార్లను మొదటగా యూసీ బెర్క్‌లీ (UC Berkeley), క్రిస్ పిస్టర్ (Kris Pister), జో కాన్ (Joe Kahn), బెర్న్‌హార్డ్ బోసర్ (Bernhard Boser) అనే సైంటిస్టులు 1990లలో డెవలప్ చేశారు. 1998లో వీరు దీనికి ‘స్మార్ట్ డస్ట్’ అనే పేరు పెట్టారు. కాగా 2022లో 115 మిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ స్మార్ట్ డస్ట్ పరిశ్రమ 2032 నాటికి దాదాపు 400 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనా ఉంది.
ఏ విధంగా పనిచేస్తుంది?
స్మార్ట్ డస్ట్‌గా పేర్కొనే మైక్రో స్కోపిక్ సెన్సార్లు నిజానికి గాలిలో తేలియాడుతూ పర్యావరణ లేదా జీవసంబంధ (Environmental or biological)డేటాను సేకరించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదొక్కప్పుడు సైన్స్ ఫిక్షన్ ఊహ మాత్రమే. కానీ ఆధునిక సాంకేతికత దానిని నిజం చేస్తోంది. 0.02 ఘన మిల్లీమీటర్లంత చిన్న మోట్‌లు (Small motes) ఉష్ణోగ్రత, తేమ, శబ్దం, రసాయనాలను రికార్డ్ చేయగలవు. ఈ సెన్సార్లు వైద్యం, గనుల తవ్వకం, రక్షణ, నిఘా వంటి రంగాలలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు వైద్యంలో రోగుల శరీరంలోని జీవ రసాయనాలను పర్యవేక్షించడానికి, పర్యావరణ విషయానికి వస్తే కాలుష్య స్థాయిలను గుర్తించడానికి ఈ సెన్సార్లు ఉపయోగపడతాయి.
ఉపయోగాలు - నష్టాలు
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ డస్ట్ వల్ల ప్రతికూలతలు కూడా ఉంటాయనే ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇవి వాతావరణంలో కలిసిపోయి ఎవరికీ తెలియకుండానే రహస్యంగా డేటాను సేకరిస్తాయి. కాబట్టి ఈ మైక్రోస్కోపిక్ సెన్సార్లు (Microscopic sensors) ప్రైవసీ, జియో ఇంజనీరింగ్ సమస్యలకు కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇది విప్లవాత్మకమైనదే అయినప్పటికీ నిఘాకోసం రహస్యంగా ఉపయోగించడం వంటి దుర్వినియోగంవల్ల నష్టాలు జరగొచ్చని హెచ్చరిస్తున్నారు. Link






